- దివికేగిన నటశేఖరుడు.. పుష్పాంజలి ఘటించిన పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు
సూపర్‌స్టార్ కృష్ణకు నివాళి అర్పించేందుకు పద్మాలయ స్టూడియోకు తెలుగు సినీ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నాయకులు తరలివచ్చారు. తన నటనాకౌశలంతో అలరించిన దిగ్గజం తమను వదిలి వెళ్లారని తలచుకుని కన్నీటి పర్యంతమయ్యారు. భౌతిక కాయానికి పుష్పంజలి ఘటించిన ప్రముఖులు.. మహేశ్‌బాబు కుటుంబ సభ్యులను ఓదార్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- దేశ ఆహార ఉత్పత్తుల్లో.. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం కీలక పాత్ర: కేంద్రమంత్రి షెకావత్
ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం తరఫున కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు.. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, వీసీ విష్ణువర్ధన్ రెడ్డి డాక్టరేట్ ప్రదానం చేశారు. దేశ ఆహార ఉత్పత్తుల్లో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషించిందని షెకావత్ అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పతనావస్థలో ఆక్వా రంగం.. : అచ్చెన్నాయుడు
ఆక్వా రైతుల సమస్యలపై ప్రశ్నించిన తెదేపా నాయకులపై ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడాన్ని ఆ పార్టీ నేతలు ఖండించారు. ఉండిలోని నాయకులపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కారుణ్య మరణానికి అనుమతించాలని జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు పెట్టుకుంటే...!
ఆయన ఓ విశ్రాంత ఏఎస్‌ఐ. గతంలో వుడా అనుమతించిన లేఅవుట్ లో ప్లాట్లను కొనుగోలుచేశారు. ఆ భూమిని ఆధిరులు నిషేధిత భూముల జాబితాలో చేర్చారు. దాంతో క్రయ విక్రయాలకు అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ.. చేసేది లేక కారుణ్య మరణానికి అనుమతించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జునకు దరఖాస్తు పెట్టుకుంటే.. ఆయన చచ్చిపోండని దురుసుగా ప్రవర్తించారని వాపోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పోటీ నుంచి తప్పుకున్న ఆప్ అభ్యర్థి.. భాజపా ఒత్తిడే కారణమని కేజ్రీవాల్ పార్టీ ఆరోపణ
గుజరాత్లో ఆమ్ఆద్మీ పార్టీ అభ్యర్థి పోటీ నుంచి తప్పుకోవడం రాజకీయంగా దుమారం రేపింది. భాజపా ఒత్తిడే కారణమని ఆప్ ఆరోపించగా.. కమలదళం తోసిపుచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మద్యం తాగొద్దని చెప్పినందుకు కూతురిని కాల్చి చంపిన తండ్రి
ఉత్తర్‌ప్రదేశ్ అలీగఢ్ జిల్లాలోని మద్రాక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అబూపుర్ ప్రాంతంలో మంగళవారం అర్థరాత్రి తండ్రి తన కుమార్తెను కాల్చి చంపాడు. హత్య చేసిన తరువాత నిందితుడు పరారయ్యాడు. ఈ ఘటనపై మృతురాలి తల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భారత్‌కు జీ20 అధ్యక్ష పగ్గాలు.. వసుధైక కుటుంబమనే భావనతో 2023 సదస్సు!
2023లో నిర్వహించనున్న జీ20 18వ శిఖరాగ్స సదస్సు బాధ్యతలను ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడొడో.. ప్రధాని నరేంద్ర మోదీకి అధికారికంగా అప్పగించారు. అధికారికంగా డిసెంబర్ 1 నుంచి జీ20 అధ్యక్ష బాధ్యతలు భారత్ చేపట్టనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రీలాంచ్‌కు సిద్ధమైన బ్లూటిక్.. భారత్‌లో ట్విట్టర్ చాలా స్లో!
ట్విట్టర్ బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్ సేవల పునరుద్ధరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని సంస్థ అధినేత ఎలాన్ మస్క్ తెలిపారు. దీంతో నవంబర్ 29నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నట్లు మస్క్ ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'జడ్డూ.. నీవు మాతో ఆడడం ఎనిమిదో వండర్'.. సీఎస్కే ట్వీట్ వైరల్!
రాబోయే ఐపీఎల్ సీజన్ గురించి ఇప్పటి నుంచే క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే చెన్నై జట్టు యాజమాన్యంతో విభేదాల కారణంగా రవీంద్ర జడేజా ఇక ఆ జట్టులో ఉండటం కష్టమే అని అందరూ అనుకున్నారు. అయితే.. అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆ జట్టు ఈ ఆల్‌రౌండర్‌ని అట్టిపెట్టుకుంది. ఈ మేరకు సీఎస్కే చేసిన ఓ ట్వీట్ వైరల్‌గా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఏంటీ కృతి వేసుకున్న డ్రెస్ రూ.68 వేలా
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరకాబోతోంది. మరోవైపు వరుస ఫొటోషూట్లతో సోషల్ మీడియాలోనూ సందడి చేస్తోంది. తాజాగా మల్టీకలర్ మిడ్డీ డ్రెస్‌తో దిగిన ఫొటోలను పోస్ట్ చేసింది. వీటిని చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఆ డ్రెస్ ధర కోసం ఇంటర్నెట్లో వెదకగా.. ధర చూసి అవాక్కవుతున్నారు. ఆ డ్రెస్ అక్షరాలా రూ. 68 వేలంట. ఓ సారి మీరూ ఆ ఫొటోలపై లుక్కేయండి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.