ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 5 PM

ఏపీ ప్రధాన వార్తలు

top news
ఏపీ ప్రధాన వార్తలు

By

Published : Nov 11, 2022, 5:01 PM IST

  • రుషికొండ నిర్మాణాలు.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై జోక్యం చేసుకోలేం: సుప్రీంకోర్టు
    SC On Rushikonda Constructions : రుషికొండ నిర్మాణాలపై దాఖలైన పిటిషన్​పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. నిర్మాణాలపై హైకోర్టులోనే ప్రస్తావించాలని.. పిటిషనర్ రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టు సూచించింది. పర్యావరణ అనుమతులు, సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించారని, హైకోర్టు ఆదేశాలనూ పాటించట్లేదని రఘురామ తరఫు న్యాయవాది వాదించి.. స్టే విధించాలని కోరగా.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై జోక్యం చేసుకోలేమని సుప్రీం స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ముస్లిం ఆడపిల్లలు చదువులో వెనకబడకూడదనే.. ఆ నిబంధన: సీఎం జగన్​
    CM JAGAN IN ABUL KALAM AZAD BIRTH ANNIVERSARY రాష్ట్రంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని సీఎం జగన్​ అన్నారు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత వైఎస్సార్‌దేనని పేర్కొన్నారు. గుంటూరులో జరిగిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఆ 17 గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించండి: హైకోర్టు
    Amaravati Farmers: రాజధానిలో స్థానికేతరులకు ఇళ్ల పట్టాలపై అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించారు. గ్రామసభలు నిర్వహించకుండానే నిరభ్యంతర పత్రాలు అడుగుతారని లంచ్​మోషన్​ పిటిషన్​లో పేర్కొన్నారు. విచారించిన కోర్టు... రెండు రోజుల్లో గ్రామసభలు నిర్వహించాలని ఆదేశించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ''ప్రత్యేక హోదాపై.. కేంద్రంతో సీఎం​ కనీసం చర్చించడం లేదు''
    MP Ram Mohan Naidu: ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పిన జగన్మోహన్​రెడ్డి.. ఇప్పుడు కేంద్రంతో కనీసం కూడా చర్చించడం లేదని తెదేపా ఎంపీ రామ్మోహన్​నాయుడు ఆరోపించారు. వైకాపా అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో ఎలాంటి అభివృద్ధి చేపట్టని ప్రభుత్వం.. రాజధానిపై కట్టుకథలు చెబుతుందని ధ్వజమెత్తారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ప్రొద్దుటూరు తెదేపా ఇంఛార్జ్​ ప్రవీణ్ కుమార్ రెడ్డికి బెయిల్​
    TDP PRAVEEN KUMAR REDDY: ప్రొద్దుటూరు తెదేపా ఇంచార్జ్​ ప్రవీణ్​ కుమార్​ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్​ మాంజురైంది. ప్రొద్దుటూరులో గత నెలలో జరిగిన అల్లర్లలో పోలీసులు ప్రవీణ్​ కుమార్​ రెడ్డిని అరెస్టు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • జడ్జిల నియామకంలో జాప్యం.. కేంద్రంపై సుప్రీంకోర్టు అసహనం
    Judges Appointment : హైకోర్టులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని నియమించేందుకు కొలీజియం పేర్లు సిఫార్సు చేసినా.. కేంద్రం పెండింగ్​లో పెట్టడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. జాప్యానికి కారణమేంటో వివరణ ఇవ్వాలని కేంద్ర న్యాయశాఖ కార్యదర్శిని ఆదేశించింది.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • దీపావళికి రూ.21లక్షల బైక్ కొని ఊరేగించడం గుర్తుందా? పాపం ఇప్పుడా బండి బూడిదై..
    దీపావళి పండుగ రోజు ఎంతో ఆనందంగా ఆ ఖరీదైన బైక్​ను కొని ఊరేగించాడు ఓ యువకుడు. కానీ ఆ ఆనందం 15 రోజులు కూడా నిలవలేదు. ఇంతలోనే అనుమానాస్పద రీతిలో ఆ బైక్​ అగ్నికి ఆహుతైపోయింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • స్టాక్​ మార్కెట్లకు భారీ లాభాలు.. సెన్సెక్స్ 1,100 ప్లస్​
    Stock Market Updates : దేశీయ స్టాక్ మార్కెట్​ సూచీలు శుక్రవారం భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 1,181 పాయింట్లు, నిఫ్టీ 321 పాయింట్లు లాభపడింది.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రాహుల్ ద్రవిడ్ ఔట్.. టీమ్ఇండియా హెడ్‌ కోచ్‌గా వీవీఎస్‌ లక్ష్మణ్‌!
    న్యూజిలాండ్‌ పర్యటనకు టీమ్​ఇండియా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌కు బీసీసీఐ విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలిసింది. దీంతో జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) డైరెక్టర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌.. మరోసారి భారత జట్టుకు హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారని సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • గుండెపోటుతో మరో నటుడు మృతి.. జిమ్​లో వర్కౌట్​ చేస్తుండగా!
    చిత్రసీమలో మరో మరణం సంభవించింది. ఓ నటుడు జిమ్​లో వర్కౌట్లు చేస్తుండగా గుండెపోటుతో కన్నుమూశాడు. అతడి మృతి పట్లు పలు సినీప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details