'అసభ్యకర పోస్టింగ్లు చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయండి' - panchumarthi anuradha
తెదేపా నేత పంచుమర్తి అనురాధపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టింగ్లు చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ మంగళగిరి చేనేత విభాగం నేతలు డిమాండ్ చేశారు.
'తెదేపా మహిళానేతపై అనుచితవ్యాఖ్యలు చేసినవారిపై చర్యలు తీసుకోవాలి'
తెలుగుదేశం పార్టీ నేత పంచుమర్తి అనురాధపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆ పార్టీ చేనేత విభాగం నేతలు డిమాండ్ చేశారు. బీసీ మహిళను ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన వైకాపా కార్యకర్తపై చర్యలు తీసుకోవాలని మంగళగిరి పోలీసులను కోరారు. వైకాపా నేతలు ఫిర్యాదు చేసిన 24 గంటల్లోనే అరెస్టు చేస్తున్న పోలీసులు.. ఇపుడు ఏం చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు.