గుంటూరు జిల్లా నరసరావుపేటలో సైనికోద్యోగులకు చెందిన ఇళ్ల స్థలాల ఆక్రమణల వ్యవహారంలో నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రా సబ్ ఏరియా కమాండింగ్ అధికారి.. సీఎస్ అధిత్యనాథ్ దాస్‌కు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌తో ఆంధ్రా సబ్ ఏరియా డిప్యూటీ జనరల్ ఆఫీసర్ ఇన్ కమాండింగ్ బ్రిగేడియర్ అభిజిత్ చంద్ర సచివాలయంలో సమావేశమయ్యారు. నరసరావుపేటకు చెందిన నాగిరెడ్డి, గోవిందరెడ్డిలకు చెందిన ఇళ్లు, ఇళ్లస్థలాలకు నష్టం కలిగించిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
'ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలి' - నరసరావు పేట సైనికుద్యోగుల వార్తలు
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌తో ఆంధ్రా సబ్ ఏరియా డిప్యూటీ జనరల్ ఆఫీసర్ ఇన్ కమాండింగ్ బ్రిగేడియర్ అభిజిత్ చంద్ర.. సచివాలయంలో సమావేశమయ్యారు. నరసరావుపేటలో ఇళ్ల స్థలాల ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని సీఎస్‌ను కోరారు.
'ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలి'
మాజీ సైనికులకు ఆస్పత్రి నిర్మాణానికి విజయవాడ సమీపంలో స్థలం కేటాయించాలని ఆయన సీఎస్‌ను కోరారు. సైనికులకు అతిథిగృహం నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు మాజీ సైనికులకు నిర్మించనున్న ఆస్పత్రి భవనాలను పోలీసు హౌసింగ్ బోర్డు ద్వారా చేపట్టే అంశాన్ని సీఎస్ ప్రస్తావించారు. దీనిపై ప్రతిపాదనలు పంపాలని ఆంధ్రా సబ్ ఏరియా బ్రిగేడియర్‌కు సీఎస్ సూచించారు.