వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచినా సీఎం జగన్.. ప్రకటనలకు మాత్రమే పరిమితమయ్యారని మాజీ మంత్రి నక్క ఆనందబాబు మండిపడ్డారు. గుంటూరు జిల్లా వేమూరులో మాట్లాడిన ఆయన.. రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం దేశంలో మూడో స్థానం నిలిచిందన్నారు. ఇలాంటి దుస్థితికి జగన్ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కారనీ.. రైతుకు గిట్టుబాటు ధర లేకుండా పోయిందన్నారు.
రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రానిది మూడోస్థానం: నక్కా ఆనందబాబు
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచినా రైతులకు న్యాయం చేయటంలో విఫలమయ్యారని మాజీ మంత్రి ఆనందబాబు విమర్శించారు. సీఎం ప్రకటనలకు మాత్రమే పరిమితమయ్యారని మండిపడ్డారు. గుంటూరు జిల్లా వేమూరులో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం దేశంలో మూడో స్థానం, కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉందన్నారు.
పంటను అమ్ముకోవడానికి రైతు వెళ్తే దళారులు రాజ్యం.. నడుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పంటను దోచుకుంటున్నారు విమర్శించారు. అన్నదాతలకు సకాలంలో ఎరువులు అందించే పరిస్థితిలో కూడా ప్రభుత్వం లేదని విమర్శించారు. తెదేపా ప్రభుత్వ హయాంలో రైతులకు సకాలంలో ఎరువులు అందించామని చెప్పారు. డెల్టా ప్రాంతంలోని ఐదు నియోజకవర్గాల్లో రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమం విజయవంతం చేయాలని ఆనందబాబు పిలుపునిచ్చారు. రైతులందరూ మద్దతు తెలపాలని కోరారు.
ఇదీ చదవండి : తెలుగు భాషాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి ఆదిమూలపు సురేష్