ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎరువుల కంపెనీల తీరుతో రైతులపై అదనపు భారం: నాగిరెడ్డి - Nagireddy is angry over the attitude of fertilizer companies

ఎరువుల కంపెనీల తీరుపై ఏపీ విత్తనాలు, ఎరువుల డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి తప్పుబట్టారు. కంపెనీలు ఇష్టారాజ్యంగా ఎరువుల ధరలను పెంచడాన్ని ఖండించారు. ఈ నిర్ణయంతో రైతులపై అదనపు భారం పడుతోందని స్పష్టం చేశారు.

AP Seeds and Fertilizer Dealers Association state president
ఏపీ విత్తనాలు, ఎరువుల డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి

By

Published : Apr 10, 2021, 5:39 PM IST

ఏపీ విత్తనాలు, ఎరువుల డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి

ఎరువుల కంపెనీలు ఇష్టారాజ్యంగా ధరలు పెంచటాన్ని ఏపీ విత్తనాలు, ఎరువుల డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి తప్పుబట్టారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోకుండా కంపెనీలు గుత్తాధిపత్యం ప్రదర్శిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ధరల పెరుగదల ద్వారా ఏపీ రైతులపై 5వేల 296కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందన్నారు. యూరియాతో కలిపితే ఈ భారం మరింతగా పెరుగుతుందని తెలిపారు. ఎరువుల కంపెనీల నిర్ణయంతో వ్యవసాయ పెట్టుబడులు పెరిగి.. రైతులు మరింత ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉందన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details