AP Second Rank in Contempt of Court Cases :కోర్టు ఉత్తర్వులు అంటేనవ్వులాటగా ఉందా? 'న్యాయస్థానంతోనే ఆటలా? ఎవరేం చేస్తారనే ధీమానా? ఎన్ని సార్లు చెప్పినా చెవికెక్కదా?' కోర్టు ధిక్కరణ కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వ అధికారులను ఉద్దేశించి న్యాయమూర్తులు అనేక సందర్భాల్లో చేసిన హెచ్చరికలివి. గత నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో చట్టబద్ధ పాలనకు తూట్లు పొడిచారనడానికి.. దేశ వ్యాప్తంగా వివిధ హైకోర్టుల్లో పెండింగ్‌లో (Pending Cases in High Court) ఉన్న ధిక్కరణ వ్యాజ్యాల్లో ఏపీ రెండో స్థానంలో ఉండడమే నిదర్శనం. కోర్టు ఉత్తర్వులు (Court Orders) అంటే రాష్ట్రంలోని ఉన్నతాధికారులు బొత్తిగా భయం లేకుండా వ్యవహరిస్తున్నారు.
పదే పదే కోర్టు మెట్లు ఎక్కడానికైనా సిద్ధపడుతున్నారు గానీ, న్యాయస్థానాల ఆదేశాలు అమలు చేయడానికి మాత్రం ముందుకు రాలేకపోతున్నారు. కోర్టుల హుందాతనాన్ని కాపాడాలని న్యాయమూర్తులు ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోని పరిస్థితి. కొన్ని సందర్భాలలో విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తేనో,. మరికొన్ని సందర్భాల్లో అరెస్టు వారెంట్ (Arrest Warrant) జారీ చేస్తేనో కోర్టు ఉత్తర్వులు ఆమలు చేస్తున్నారు.
ధిక్కరణ కేసులో ఉన్నతాధికారులపై హైకోర్టు ఆగ్రహం.. కోర్టులో నిలబెట్టి
Contempt of Court Cases in YSRCP Government :గత ప్రభుత్వ హయాంలో చేసిన ఉపాధి పనులు, నీరు-చెట్టు పథకం బిల్లులను చెల్లించేందుకు ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మొండికేసింది. ఎంపిక చేసుకున్న కొందరికే మంజూరు చేస్తూ.. మిగిలిన వారి విషయంలో వివక్ష చూపుతోంది. హైకోర్టు జోక్యంతో కొంతమందికి ఉపశమనం లభించినా..ప్రభుత్వం బిల్లులను చెల్లించలేదంటూ హైకోర్టులో దాఖలైన కోర్టు ధిక్కరణ వ్యాజ్యాల సంఖ్య వేలల్లో ఉంది. జస్టిస్ ఆర్.రఘునందన్ రావు వద్దే రెండు వేలకు పైగా ధిక్కరణ పిటిషన్లు ఉన్నాయి.