AP Sarpanch Association Protests For Panchayat Funds :కేంద్రం నుంచి వచ్చిన 14, 15వ ఆర్థిక సంఘం నిధులు 8,660 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు చెల్లించకుండా దారి మళ్లించిందని రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్‌లు ఆందోళనకు దిగారు.
సర్పంచ్లకు సంకెళ్లు : రాష్ట్ర ప్రభుత్వం వాడుకున్న సర్పంచ్‌ల నిధులను వెంటనే జమ చెయ్యాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ సర్పంచ్‌ల సంఘం ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు వినూత్నంగా నిరసన తెలిపారు. సర్పంచ్లకు చెక్ పవర్ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం సంకెళ్లు వేసిందని సర్పంచ్‌లు చేతులను కట్టి వేసుకొని నిరసన తెలిపారు. సర్పంచుల ఖాతాలో నిధులు లేనందున ఎలాంటి అభివృద్ధి పనులు చెయ్యలేక పోతున్నామని సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అధికార వైసీపీకి సర్పంచ్‌లు సైతం పాల్గొన్నారు.
Sarpanch Agitation Against YSRCP Government in State :అభివృద్ధి పనులు చేయలేకపోతున్నామని, ప్రజలు నిలదీస్తున్నారంటూ పలువురు సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం, పంచాయతీరాజ్ ఛాంబర్ సంయుక్త ఆధ్వర్యంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని వివిధ గ్రామాల సర్పంచులు గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించి వినతి పత్రం అందజేసేందుకు ఏలూరు కలెక్టరేట్ కు విచ్చేశారు.
బిందెడు నీళ్లు ఇవ్వలేని స్థితిలో ఉన్నాం.. సర్పంచ్‌ల ఆవేదన
Sarpanch Protest Against Diversion of Panchayat Funds :కార్యాలయంలో గాంధీ విగ్రహం వద్దకు వెళ్లనివ్వకుండా పోలీసులు కార్యాలయం ప్రధాన ద్వారం గేట్లు మూసివేసి సర్పంచులు అడ్డుకున్నారు. తాము నిరసన తెలపడానికి రాలేదని.. గాంధీజీకి నివాళులర్పించి వినతి పత్రం అందజేసి వెళ్లిపోతామని చెప్పినా పోలీసులు వారికీ అనుమతి లేదంటూ అడ్డుకున్నారని సర్పంచ్‌లు తెలిపారు. దాంతో సర్పంచులు ప్రధాన ద్వారం గేటు ముందు బైఠాయించి పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు.
సీబీఐతో ఎంక్వయిరీ చేయించాలి :చేతులకు తాళ్లతో కట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం తమపై నిరంకుశంగా వ్యవహరిస్తుందని సర్పంచ్‌లు వినూత్నంగా నిరసన తెలిపారు. లోపలికి అనుమతి ఇవ్వకపోవడంతో ఫ్లెక్సీపై ఉన్న గాంధీజీ ఫోటోకి పూలమాల నివాళులర్పించారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ ఛాంబర్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు కడలి గోపాలరావు మాట్లాడుతూ కనీసం గాంధీజీ విగ్రహానికి పూలమాల వేయడానికి కూడా అనుమతి ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. సీబీఐతో ఎంక్వయిరీ చేయించి దారి మళ్లించిన నిధులను పంచాయతీలకు జమ చేయాలని డిమాండ్ చేశారు.