AP record in vaccination: బాలలకు కరోనా టీకా వేయడంలో ఏపీ రికార్డు సృష్టించింది. రాష్ట్రవ్యాప్తంగా 15 నుంచి 18 ఏళ్ల మధ్యనున్నవారు 24.41 లక్షల మంది ఉండగా.. గత 3 రోజుల్లో 53.3శాతం మందికి టీకా వేశారు. జాతీయ సరాసరి 17.13 శాతంగా ఉంది. టీకా వేయడంలో ఏపీ మొదటి స్థానంలో నిలవగా.. హిమాచల్‌ప్రదేశ్ 49.98 శాతంతో రెండో స్థానంలో ఉంది.
AP record in vaccination: టీనేజర్లకు టీకా వేయడంలో ఏపీ రికార్డ్.. దేశంలోనే మొదటి స్థానం.. - టీనేజర్లకు కరోనా టీకా
AP record in vaccination: టీనేజర్లకు కరోనా టీకా వేయడంలో రాష్ట్రప్రభుత్వం రికార్డు సృష్టించింది. రాష్ట్రవ్యాప్తంగా 15 నుంచి 18 ఏళ్ల మధ్యనున్నవారు 24.41 లక్షల మంది ఉండగా.. గత 3 రోజుల్లో 53.3శాతం మందికి టీకా వేశారు. బాలలకు టీకా వేయడంలో ఏపీ మొదటి స్థానంలో నిలవగా.. హిమాచల్‌ప్రదేశ్ 49.98 శాతంతో రెండో స్థానంలో ఉంది.
AP record in vaccination
ఈ నెల 3వ తేదీ నుంచి 5వ తేదీ (బుధవారం) అర్ధరాత్రి వరకూ 15-18ఏళ్ల వయస్సు ఉన్న 13 లక్షల మందికి కరోనా టీకా మొదటి డోసు వేశారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. నెల్లూరు 76 శాతం, కృష్ణా 65 శాతం, తూర్పుగోదావరి 64 శాతం, చిత్తూరులో 59 శాతం మంది టీకా తీసుకున్నారు.
ఇదీ చదవండి:BOOK FESTIVAL : పుస్తక మహోత్సవానికి విశేషాదరణ... 'ఘంటసాలకు' ఘన నివాళి