రేషన్ డీలర్లను కరోనా బీమా పరిధిలో చేర్చాలని... రాష్ట్ర రేషన్ డీలర్ల అధ్యక్షుడు మాధవరావు కోరారు. కరోనా వైరస్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో కోటీ 50 లక్షల మందికి రేషన్ సరకులు పంపిణీ చేశామన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని వారి సమస్య పరిష్కరించాలన్నారు. నెలాఖరులోగా డిమాండ్లు పరిష్కరించకపోతే... మే 6 నుంచి నిరవధికంగా విధులు బహిష్కరిస్తామని హెచ్చిరించారు. ఈ మేరకు గుంటూరు ఎమ్మార్వో రవిబాబుకు వినతిపత్రం అందజేశారు.
'రేషన్ డీలర్లను కరోనా బీమా పరిధిలో చేర్చాలి'
రేషన్ డీలర్లను కరోనా బీమా పరిధిలో చేర్చాలని... రాష్ట్ర రేషన్ డీలర్ల అధ్యక్షుడు మాధవరావు డిమాండ్ చేశారు. ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలకు రేషన్ సరకులు పంపిణీ చేశామన్నారు.
ఎమ్మార్వోకు వనిత పత్రం ఇస్తున్న రేషన్ డీలర్లు