ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెల్లవారుజాము నుంచి రోడ్డుపై పడిగాపులు - నల్గొండ గుంటూరు జిల్లాల సరిహద్దు తాజా న్యూస్

ఆంధ్రా-తెలంగాణ సరిహద్దుల్లోని చెక్​పోస్టుల వద్ద ప్రజల పడిగాపులు పడుతున్నారు. తెలంగాణ పోలీసులు నిరభ్యంతర పత్రాలు ఇచ్చారని.. కారణంగా.. స్వస్థలాలకు వెళ్లేందుకు వచ్చిన తమను ఏపీలోకి పోలీసులు అనుమతించడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం గర్భిణులను రానివ్వకుండా ఆంక్షలు విధించారంటూ వాపోయారు. ఈ విషయమై అధికారులు స్పందించాలని కోరుతున్నారు.

తెల్లవారుజాము నుంచి రోడ్డుపై పడిగాపులు
తెల్లవారుజాము నుంచి రోడ్డుపై పడిగాపులు

By

Published : Mar 26, 2020, 4:14 PM IST

తెల్లవారుజాము నుంచి రోడ్డుపై పడిగాపులు

కరోనా కారణంగా తెలంగాణ నుంచి రాష్ట్రానికి వస్తున్న వారిని నల్గొండ, గుంటూరు జిల్లాల సరిహద్దుల వద్ద పోలీసులు నిలిపివేశారు. ఫలితంగా దామరచర్ల - పొందుగుల మధ్య సరిహద్దుల్లో రెండు వేల మంది ఏపీ ప్రజలు ఆగిపోయారు. ఆయా ప్రాంతాల్లో చెక్​ పోస్టులు ఏర్పాటు చేసిన పోలీసులు... వారిని ఏపీలోకి అనుమతించేది లేదంటున్నారు. కనీసం గర్భిణులను రానివ్వకుండా ఆంక్షలు విధించారు. ఇక చేసేది లేక తెల్లవారుజాము నుంచి రోడ్డుపై పడిగాపులు పడుతున్నారు. గత మూడు రోజులుగా సరైన తిండి లేక అల్లాడి... ఇక్కడకి చేరుకున్నాక కూడా ఇబ్బందులు తప్పడం లేదంటూ ఆవేదన చెందారు. వైద్య పరీక్షలు చేసి తమ ఊర్లకు వెళ్లేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పోలీసులు మాత్రం ఎవరినీ వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. తెలంగాణ పోలీసులు నిరభ్యంతర పత్రాలు ఇవ్వటం వల్లే ఇంత దూరం వచ్చామని... ఇపుడు వెనక్కి వెళ్లమంటే ఎలా వెళ్తామని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details