AP Politicians Condoled the Death of Chandramohan:టాలీవుడ్ ప్రముఖ సీనియర్ నటుడు చంద్రమోహన్ (82) కన్నుమూశారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. దీంతో యావత్ సినీ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి లోనైంది. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లో సోమవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
CM Jagan Condoled the Death of Actor Chandramohan:సీనియర్ నటుడు చంద్రమోహన్ మృతిపట్ల సీఎం జగన్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూయడం బాధాకరమని అన్నారు. తొలి సినిమాకే నంది అవార్డును గెలుచుకున్న ఆయన తెలుగు, తమిళ భాషల్లో వందలాది సినిమాల్లో నటించి తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని అన్నారు. చంద్రమోహన్ గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని జగన్ తెలిపారు.
చంద్రమోహన్ - 1000 సినిమాలు చేసి, 100 కోట్లు పోగొట్టుకొని, స్థిరంగా నిలబడి!
Governor Abdul Nazir Condoled the Death of Actor Chandramohan:చంద్రమోహన్ మృతిపట్ల గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకురాలని దేవున్ని ప్రార్థించారు.
Pawan Kalyan Condoled the Death of Actor Chandramohan:సీనియర్ నటుడు చంద్రమోహన్ మృతిపట్ల జనసేన అధినేత సినీ యాక్టర్ పవన్ కల్యాణ్ సంతాంపం వ్యక్తం చేశారు. ఆయన మృతి చెందారని తెలిసి ఆవేదన చెందారని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పరమేశ్వరుణ్ణి కోరుకుంటున్నట్లు తెలిపారు.