ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పీఈ సెట్ ఫలితాల్లో అమ్మాయిలదే హవా - released

రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ఏఎన్​యూ నిర్వహించిన ఏపీ పీఈ సెట్ ఫలితాలు వెల్లడయ్యాయి. వీటిల్లో ఆమ్మాయిలు అగ్రస్థానాలను కైవసం చేసుకున్నారు.

ఫలితాలు విడుదల చేస్తున్న విజయరాజు

By

Published : May 15, 2019, 1:41 PM IST

ఫలితాలు విడుదల చేస్తున్న విజయరాజు

వ్యాయామ కళాశాలలో చేరేందుకు ఉన్నత విద్యా మండలి నిర్వహించిన ఏపీ పీఈ సెట్ ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ఆచార్య విజయరాజు... నాగార్జున విశ్వవిద్యాలయంలో పలితాలు విడుదల చేశారు. ఫలితాలలో మొదటి 10 ర్యాంకుల్లో 8 ర్యాంకులను అమ్మాయిలు కైవసం చేసుకున్నారు. మొదటి ర్యాంకును కర్నూలుకు చెందిన హారిక, ద్వితీయ ర్యాంకును ప్రకాశం జిల్లాకు చెందిన రేవతి, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వినీల ప్రియదర్శిని సొంతం చేసుకున్నారు. ఈనెల 17 నుంచి ఉన్నత విద్యా మండలి వెబ్​సైట్ ద్వారా ర్యాంక్ కార్డులు డౌన్​లోడ్ చేసుకోవచ్చని విజయరాజు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details