కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు గుంటూరులో సైనికుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి సలాం చేసే కార్యక్రమాన్ని ఎపీ పీసీసీ అధ్యక్షుడు శైలజానాధ్ ఏర్పాటు చేశారు. సైనికులు దేశం కోసం ప్రాణాలను అర్పిస్తే వారిని అవమానపరిచేలా ప్రధాని మోదీ మాట్లాడుతున్నారని శైలజానాధ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనా దురాక్రమణకు పాల్పడుతుందని అధికారులు, సైనికులు చెబుతుంటే.. భారత భూబాగంలోకి ఎవరూ రాలేదు అని చెప్పటాన్ని తప్పుపట్టారు. మోదీ నిజాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, భారత సైన్యాల పక్షాన, ప్రజల పక్షాన కాంగ్రెస్ నిలబడుతుందని పేర్కొన్నారు. చైనా దాడి, సైనికుల మరణాల గురించి మోదీ నిజం చెప్పాలన్నారు. సత్యాన్ని చెప్పకుండా ముఖం చాటేసిన మోదీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని అన్నారు.
సైనికుల మరణాలపై మోదీ వివరణ ఇవ్వాలి: శైలజానాథ్ - Modi should explain the deaths of soldiers
మోదీ హయాంలో అమరులకు అవమానం జరిగే పరిస్థితి ఏర్పడిందని ఎపీ పీసీసీ అధ్యక్షుడు శైలజానాధ్ అన్నారు. చైనా దాడి, సైనికుల మరణాల గురించి ప్రధాని నిజం చెప్పాలని ప్రశ్నించారు.
![సైనికుల మరణాలపై మోదీ వివరణ ఇవ్వాలి: శైలజానాథ్ guntur district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7778946-301-7778946-1593162345357.jpg)
సైనికుల మరణాలపై మోదీ వివరణ ఇవ్వాలి: ఎపీ పీసీసీ అధ్యక్షుడు