ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కన్నులపండువగా ముత్తు మరియన్ అమ్మవారి తిరునాళ్లు - కన్నులపండువగా ముత్తు మరియన్ అమ్మవారి తిరునాళ్లు

గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం వావిలాల నగర్​లో తమిళ కాందిశీకులు ముత్తు మరియన్ అమ్మవారి తిరునాళ్లను వైభవంగా నిర్వహించారు. భక్తులు శూలాలు ధరించి అమ్మవారి మెుక్కులు తీర్చుకున్నారు.

కన్నులపండువగా ముత్తు మరియన్ అమ్మవారి తిరునాళ్లు

By

Published : May 6, 2019, 11:24 AM IST

కన్నులపండువగా ముత్తు మరియన్ అమ్మవారి తిరునాళ్లు

గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం వావిలాల నగర్​లో తమిళ కాందిశీకులు ముత్తు మరియన్ అమ్మవారి తిరునాళ్లను.. ఆదివారం కన్నుల పండువగా నిర్వహించారు. ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు...అభిషేకాలు నిర్వహించి మూడు రోజులు, వారం రోజులు, 11 రోజులు , 40 రోజులు నిష్ఠతో దీక్షలు చేసిన భక్తులు సుబ్రహ్మణ్యస్వామి శూలాలు ధరించి ఆమ్మవారి మొక్కు తీర్చుకున్నారు. మరికొందరు శరీరానికి ఇనుప కొక్కాలతో వేలాడుతూ ప్రదర్శనగా వెళ్లారు. ఈ సందర్భంగా డప్పుల వాయిద్యాలకు మహిళల నృత్యం ఆహుతులను అలరించాయి. ఈ వేడుకను తిలకించేందుకు శ్రీలంక, తమిళనాడు, బెంగుళూరు తదితర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు.
ఇవి కూడా చదవండి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details