ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇప్పటివరకు మౌనంగా ఉన్నాం.. ఇలాగే కొనసాగితే సహించేది లేదు.. ఖబడ్దార్: బండి శ్రీనివాస్​ - ఏపీ ఉద్యోగుల వార్తలు

APNGO Leaders: ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతికి ఇవ్వాల్సిన డీఎను వెంటనే చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం జగన్ స్పష్టం చేశారని.. ఏపీఎన్​జీవో నేత బండి శ్రీనివాస్ తెలిపారు. నూతనంగా ఎన్నికైన ఎపీ ఎన్జీవో అధ్యక్షులు సహా కార్యవర్గ సభ్యులు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిశారు. వరుసగా 3 రోజులు సంక్రాంతి సెలవులు రావడం వల్ల సర్క్యులర్ ఇవ్వడంలో జాప్యం జరిగినట్లు సీఎంవో అధికారులు చెప్పినట్లు బండి శ్రీనివాస్‌ తెలిపారు. ఎపీఎన్జీవోలు ముఖ్యమంత్రిమెప్పు కోసం పని చేస్తున్నారని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ ఆరోపణలపై బండి శ్రీనివాస్​ మండిపడ్డారు. ఇప్పటివరకు ఏం చేసినా మౌనంగా ఉన్నామని, ఇలాగే కొనసాగితే సహించేది లేదు.. ఖబడ్డార్ అంటూ హెచ్చరించారు.

APNGO Leaders
ఎపీఎన్జీవో నేత బండి శ్రీనివాస్

By

Published : Jan 19, 2023, 5:48 PM IST

Updated : Jan 19, 2023, 7:17 PM IST

బండి శ్రీనివాస్, ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు

AP NGO President Bandi Srinivasa Rao: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతికి ఇవ్వాల్సిన డీఏను వెంటనే చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేసినట్లు ఎపీఎన్జీవో నేత బండి శ్రీనివాస్ తెలిపారు. వరుసగా 3 రోజులు సంక్రాంతి సెలవులు రావడం వల్ల సర్క్యులర్ ఇవ్వడంలో జాప్యం జరిగినట్లు సీఎంవో అధికారులు చెప్పినట్లు తెలిపారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని నూతనంగా ఎన్నికైన ఎపీ ఎన్జీవో అధ్యక్షులు సహా కార్యవర్గ సభ్యులు కలిశారు. కార్యవర్గ సభ్యులను అధ్యక్షుడు బండిశ్రీనివాస్ పరిచయం చేశారు. సంక్రాంతి పండుగకు డీఏ ఇస్తామని చెప్పిన హామీని గుర్తు చేయగా వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

ఉద్యోగుల సమస్యలపై కొన్ని ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు గవర్నర్​ను కలసి ఫిర్యాదు చేయడాన్ని బండిశ్రీనివాస్ తప్పు పట్టారు. ఉద్యోగసంఘాలు నిబంధనలను పాటించాలని అలా చేయకపోతే గుర్తింపు రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుందన్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు. ఎపీఎన్జీవోలు ముఖ్యమంత్రిమెప్పు కోసం పనిచేస్తున్నామని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ ఆరోపణలపై మండిపడ్డారు. తాము ప్రభుత్వ దయాదాక్షిణ్యాలతో పీఆర్సీ తెచ్చుకోలేదని.. ఉద్యోగుల తరపున పోరాటం చేసి సాధించామన్న విషయం తెలుసుకోవాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘం సమస్యలపై పోరాటం చేయలేకే గవర్నర్ ను కలసి ఫిర్యాదు చేశారన్నారు. సూర్యనారాయణ వెనుక ఏ శక్తి ఉండి పనిచేయిస్తుందో ఉద్యోగులు అంతా గమనిస్తున్నారని బండి వ్యాఖ్యానించారు.

ఇప్పటి వరకు ఏం చేసినా, ఎన్ని చేసినా తాము మౌనంగా ఉన్నామని, ఇలాగే కొనసాగితే సహించేది లేదని ఖబడ్దార్​ అంటూ హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి గుర్తింపును సూర్యనారాయణ దొంగచాటున తెచ్చుకున్నారన్న బండి... డిపార్టు మెంట్​లో సూర్యనారాయణ చేసిన అక్రమాలు చాలా ఉన్నాయన్నారు. అన్ని సమస్యలను పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారని, ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే అవసరమైతే ఉద్యమానికి వెళ్లేందుకూ తాము సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. తమను బఫూన్​లు అని అంటున్న వారు.. పీఆర్సీ పోరాట సమయంలో శ్రీకాకుళంకు ఎందుకు పారిపోయారని ఎన్జోవో సంఘం కార్యదర్శి శివారెడ్డి మండిపడ్డారు. ఎపీ ఎన్జీవో సంఘాన్ని హేళన చేసేలా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం వ్యవహరించడం సరికాదని హితవు పలికారు.

ఇవీ చదవండి

Last Updated : Jan 19, 2023, 7:17 PM IST

ABOUT THE AUTHOR

...view details