స్థానిక ఎన్నికలకు సంబంధించి ఈసీ షెడ్యూల్‌తో ఒక్కసారిగా ఉద్యోగులు ఉలిక్కిపడ్డారని ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. వాక్సినేషన్ పూర్తయ్యాక ఎన్నికలకు వెళ్తే మంచిదన్న ఆయన ఇప్పటికే చాలామంది ఉద్యోగులు కరోనాతో ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ఎన్నికలు వాయిదా వేయాలని 2 నెలల నుంచి కోరుతున్నా పట్టించుకోవటం లేదన్నారు.
ఎన్నికల షెడ్యూల్‌ను సత్వరం ఉపసంహరించాలని కోరారు. మొండిగా కమిషన్ ముందుకు వెళ్తే... ఎన్నికలు బహిష్కరిస్తామని తేల్చి చెప్పారు. అవసరమైతే కోర్టుకు వెళ్తామని ఆయన హెచ్చరిాంచారు. ఉద్యోగులకు రావాల్సిన రాయితీలు తప్పక సాధించుకుంటామన్న ఆశాభావాన్ని చంద్రశేఖర్ రెడ్డి వ్యక్తం చేశారు.