AP MRDA Act amended Section-15 AP State Govt: ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఏపీ ఎంఆర్డీఏ చట్టంలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. సెక్షన్-15లో చేసిన సవరణలు రాష్ట్రంలోని అన్ని పట్టణాభివృద్ధి సంస్థల్లో సోమవారం నుంచి అమలులోకి వచ్చినట్లు పురపాలక, పట్టణాభివృద్ధి సంస్థ గెజిట్ విడుదల చేసింది. మాస్టర్ ప్లాన్‌లో మార్పులకు స్థానిక సంస్థల్లో ఎన్నికైన పాలకవర్గాలు లేని చోట ప్రత్యేక అధికారి, పర్సన్ ఇన్‌ఛార్జిలు సిఫార్సు చేసేలా సవరించారు. పట్టణాభివృద్ధి సంస్థలు వాటంతట అవి కూడా బృహత్తర ప్రణాళికలో సవరణలు చేయవచ్చు.
ఏపీ ఎంఆర్డీఏ చట్టం సెక్షన్-15లో సవరణలు చేసిన.. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం - Amendments in Section 15 of AP MRDA Act
AP MRDA Act amended Section-15 AP State Govt: మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఏపీ ఎంఆర్డీఏ చట్టంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఏపీ ఎంఆర్డీఏ చట్ట సవరణ రాజధాని ప్రాంత ప్రాధికార అభివృద్ధి సంస్థ సీఆర్డీఏ పరిధిలో ఇటీవలే అమలులోకి వచ్చింది. ఇప్పుడు అన్ని పట్టణాభివృద్ధి సంస్థల్లోనూ అమలులోకి వచ్చేలా పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీ ఎంఆర్డీఏ చట్టం సెక్షన్ 15లో సవరణలు
ప్రజలతో పాటు స్థానిక సంస్థల అభిప్రాయం తీసుకునేలా ఇప్పుడు చట్ట సవరణ చేశారు. భూ వినియోగ మార్పిడికి సంబంధించి ప్రజలు కూడా నేరుగా ప్రతిపాదించేలా చేశారు. ఏపీ ఎంఆర్డీఏ చట్ట సవరణ రాజధాని ప్రాంత ప్రాధికార అభివృద్ధి సంస్థ సీఆర్డీఏ పరిధిలో ఇటీవలే అమలులోకి వచ్చింది. ఇప్పుడు అన్ని పట్టణాభివృద్ధి సంస్థల్లోనూ అమలులోకి వచ్చేలా పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇవీ చదవండి: