ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఏపీ మంత్రుల ప్రకటనలు పూర్తిగా అవాస్తవం' - ఏపీలో మద్యం విక్రయాలపై జీవీఎల్ వ్యాఖ్యలు

మద్యం అమ్మకాలపై నిర్ణయం పూర్తిగా రాష్ట్రాలదేనని భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు తెలిపారు. పలు రాష్ట్రాల వినతి మేరకే కేంద్రం సడలింపులు ఇచ్చినట్టు వివరించారు. కేంద్రం ఆదేశించడం వల్లే మద్యం విక్రయిస్తున్నామనే ఏపీ మంత్రుల ప్రకటనలు అబద్ధమని పేర్కొన్నారు.

mp gvl
mp gvl

By

Published : May 6, 2020, 7:19 PM IST

మీడియాతో ఎంపీ జీవీఎల్

మద్యం అమ్మకాలపై వివిధ పార్టీలు అపోహలు కలిగిస్తున్నాయని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. మద్యం అమ్మకాలపై నిర్ణయం పూర్తిగా రాష్ట్రాలదేనని స్పష్టం చేశారు. వివిధ రాష్ట్రాల వినతి మేరకు కేంద్రం కొన్ని సడలింపులు ఇచ్చిందని వెల్లడించారు.

కేంద్రం ఆదేశించడం వల్లే మద్యం విక్రయాలు చేస్తున్నామని ఏపీ మంత్రులు చేసిన ప్రకటనలు పూర్తిగా అవాస్తవమని జీవీఎల్ చెప్పారు. కేంద్రం ఆశించడం నిజమైతే మిగతా దక్షిణాది రాష్ట్రాలు ఎందుకు మద్యం విక్రయించటం లేదని ప్రశ్నించారు. మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం రాష్ట్రాలకే వెళ్తుందన్న ఆయన... 75 శాతం ధరలు పెంచి అమ్మాలని నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం కాదా..? అని నిలదీశారు.

వైకాపా ప్రభుత్వ నిర్ణయాలను కేంద్రంపై రుద్దడం సరికాదని జీవీఎల్‌ అన్నారు. మద్యం అమ్మకాలపై ఆగమేఘాల మీద నిర్ణయం ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. మద్యం విషయంలో వైకాపా, తెదేపావి అవకాశవాద రాజకీయాలని విమర్శించారు. మద్య నిషేధం అంటున్న వైకాపా.. షాపులు ఎందుకు తెరిచిందని అడిగారు. మద్య నిషేధం అమలు చేసేందుకు ఇది సరైన అవకాశం కాదా అని నిలదీశారు.

ఇదీ చదవండి

'మాకు ఇష్టం లేదు... కేంద్రం చెప్పిందనే మందుషాపులు తెరిచాం'

ABOUT THE AUTHOR

...view details