ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

‘అప్పు’ల్‌.. తిప్పల్‌, పోర్టుల నిర్మాణం పేరుతో 5వేల కోట్ల రుణానికి విశ్వప్రయత్నాలు - పోర్టుల నిర్మాణం పేరుతో రుణానికి మారిటైం బోర్టు

AP Maritime Board: రెండు పోర్టుల నిర్మాణం పేరుతో రూ.5వేల కోట్లు రుణానికి ఏపీ మారిటైం బోర్డు ప్రయత్నాలు సాగిస్తోంది. ఆర్‌ఈసీ లిమిటెడ్‌ నుంచి ఈ రుణం తీసుకునేందుకు తాజాగా మంతనాలు జరుపుతోంగి. రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.1,413 కోట్ల రుణం సమీకరణ చేస్తోంది.

AP Maritime Board e
ఏపీ మారిటైం బోర్డు

By

Published : Nov 2, 2022, 7:35 AM IST

AP Maritime Board: రాష్ట్రంలో రెండు పోర్టుల నిర్మాణానికి ఏపీ మారిటైం బోర్డు ఏకంగా 5వేల కోట్ల రూపాయల రుణాన్ని అధిక వడ్డీలకు తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఆర్​ఈసీ లిమిటెడ్‌ నుంచి ఈ రుణం తీసుకునేందుకు తాజాగా మంతనాలు సాగిస్తోంది. మారిటైం బోర్డు రుణాలు తీసుకునేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఈమధ్యే అనుమతులిచ్చింది. రెండు పోర్టుల నిర్మాణానికి... ఒకేసారి అంత మొత్తం అవసరం ఉండదనేది కొందరి వాదన. ఒకేసారి 5వేల కోట్ల రూపాయల తెచ్చి ఇతర అవసరాలకు మళ్లించే అవకాశం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఆర్‌ఈసీ రుణానికి వడ్డీ 12 నుంచి 13 శాతం వరకు ఉంటుందని సమాచారం. అంతే కాకుండా రిజర్వు బ్యాంకు నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో రాష్ట్ర ప్రభుత్వం మరో 14వందల 13 కోట్ల రుణాన్ని సమీకరించింది. ఏడేళ్ల కాల పరిమితితో 700 కోట్ల రూపాయలను 7.75 శాతం వడ్డీకీ మరో 713 కోట్ల రూపాయలను 11 ఏళ్ల కాలపరిమితికి 7.86 శాతం వడ్డీ రేటుతో తీసుకుంది.

ABOUT THE AUTHOR

...view details