ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రవాణా వాహనాలకు గ్రీన్​టాక్స్ ఉపసంహరించుకోవాలి..' - సీఎం జగన్‌

Lorry owners association letter to CM Jagan: ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వై.వి ఈశ్వరయ్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి రాష్ట్రంలోని రవాణా వాహనములకు పెంచిన గ్రీన్ టాక్స్ ఉపసంహరించుకోవాలని లేఖ రాశారు. రాష్ట్ర లారీయజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ పరిస్థితుల్లో మన రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ ట్యాక్స్ రెండు వందల రూపాయల నుండి సుమారు 20వేల వరకు పెంపుదల చేయుటం ఏంటని ప్రశ్నించారు. ఈ విషయమై ముఖ్యమంత్రి పరిశీలించి పెంచిన గ్రీన్ టాక్స్ వెంటనే తగ్గించి రాష్ట్రంలోని రవాణా రంగానికి ఊరట కల్పించాల్సిందిగా కోరారు.

AAP lorry owners association
AP lorry owners association

By

Published : Nov 12, 2022, 3:35 PM IST

Lorry owners association letter to CM Jagan: రాష్ట్రంలోని రవాణా వాహనాలకు పెంచిన గ్రీన్ టాక్స్ ఉపసంహరించుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్​మోహన్​రెడ్డికి ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వైవీ ఈశ్వరయ్య లేఖ రాశారు. రాష్ట్రంలో రవాణా రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని పేర్కొన్నారు. సరిహద్దు రాష్ట్రాల కన్నా డీజిల్, ఇతర ఇంధనాల ధర రాష్ట్రంలో ఎక్కువగా ఉందని తెలిపారు. దీంతో ఇతర రాష్ట్ర వాహనాల కిరాయిలతో పోటీ పడలేక రాష్ట్ర లారీయజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ పరిస్థితుల్లో మన రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ ట్యాక్స్ రెండు వందల రూపాయల నుంచి సుమారు 20వేల వరకు పెంచడం ఏంటని ప్రశ్నించారు. సరిహద్దు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఏపీ మాదిరిగా గ్రీన్ టాక్స్ వసూలు చేయటం లేదన్నారు. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలలో ప్రస్తుతం సంవత్సరానికి 200 నుంచి 500రూపాయలు మాత్రమే వసూలు చేస్తున్నారని తెలిపారు. ఈ విషయమై ముఖ్యమంత్రి పరిశీలించి పెంచిన గ్రీన్ టాక్స్ వెంటనే తగ్గించి రాష్ట్రంలోని రవాణా రంగానికి ఊరట కల్పించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details