ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అసెంబ్లీ సమావేశాలకు పటిష్ట బందోబస్తు:ఎస్పీ విశాల్ గున్నీ - గుంటూరు జిల్లా ఎస్పీ విశాల్‌ గున్నీ

రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. 1637 మంది అధికారులు, సిబ్బంది బందోబస్తుని పర్యవేక్షిస్తారని గుంటూరు గ్రామీణ ఎస్పీ విశాల్ గున్నీ తెలిపారు.

Andhra Legislative Assembly
Andhra Legislative Assembly

By

Published : Nov 29, 2020, 3:17 PM IST

రేపటి నుంచి రాష్ట్ర శాసనసభ సమావేశాలు జరగనున్నాయి. సమావేశాలకు 1637 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో బందోబస్తును చేపట్టారు. నలుగురు ఏఎస్పీలు, 20 మంది డీఎస్పీలకు పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించినట్లు గుంటూరు జిల్లా ఎస్పీ విశాల్‌ గున్నీ తెలిపారు.

గరుడ కంట్రోల్ సెంటర్ నుంచి బందోబస్తు విధులను పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఐటీ కోర్ టీమ్ ఆధ్వర్యంలో అసెంబ్లీ పరిసరాల్లో సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశామని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details