ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డీజీపీ హాజరుకు ఆదేశించిన హైకోర్టు - undefined

హేబియస్ కార్పస్ పిటిషన్ విషయంలో రాష్ట్ర డీజీపీ హాజరుకు హైకోర్టు ఆదేశించింది. విజయవాడకు చెందిన దంపతులను అక్రమంగా పోలీసులు అరెస్టు చేశారని.. వారిని వెంటనే హాజరుపరచాలంటూ.. దాఖలైన హేబియస్ కార్పస్ పిటిషన్​పై సరైన చర్యలు తీసుకోనందుకు ఉన్నత న్యాయస్థానం ఈ ఆదేశాలు జారిచేసింది.

DGP
DGP

By

Published : Feb 12, 2020, 11:30 PM IST

కోర్టు ఆదేశాలను సరిగ్గా అమలు పరచలేదంటూ.. రాష్ట్ర డీజీపీని హాజరు కావలసిందిగా హైకోర్టు ఆదేశించింది . ఈ నెల 14న తమ ముందు హాజరు కావాలని పేర్కొంటూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్ కుమార్ , జస్టిస్ రమేశ్ తో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలు జారీచేసింది . తన కుమారుడు రెడ్డి గౌతమ్ , కోడలు ఎల్లంటి లోచనిని విజయవాడలోి కిందటేడాది అక్టోబర్ 28న విశాఖ 4వ పట్టణ పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని పేర్కొంటూ రెడ్డి గోవిందరావు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు . ఈ వ్యాజ్యంలో విశాఖ నాలుగో పట్టణ పోలీసులు కోర్టులో ప్రమాణపత్రం దాఖలు చేస్తూ వారిద్దరిని విశాఖలో నవంబర్ 1న అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు నవంబర్ 2న హాజరు పరిచామని తెలిపారు . పిటిషనర్ రెడ్డి గోవిందరావు కోర్టులో రిప్లై అఫిడవిట్ దాఖలు చేస్తూ పోలీసులు తప్పుడు కేసు నమోదు చేశారన్నారు . కోడలు ఎల్లంటి లోచినిని పలువురు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని వారిపై కేసు నమోదు చేయాలని ఆమె విజయవాడ పటమట పోలీసులకు ఫిర్యాదు చేసినా , హైకోర్టు ఆదేశించినా కేసు నమోదు చేయలేదన్నారు .

2019 అక్టోబర్ 28 / 29 తేదీలో విశాఖ నాలుగో పట్టణ ఎస్​హెచ్​ఓ . . దంపతులిద్దర్ని తీసుకెళ్లిన కారు , టోల్ గేటు రశీదు , వీడియో ఫుటేజ్ వివరాల్ని పిటిషనర్ కోర్టుకు అందజేశారు . సున్నపుబట్టీలు ప్రాంతంలో ఉన్న తమ తరపు న్యాయవాది షేక్ మహ్మద్ ఇస్మాయిల్ వద్దకు విజయవాడలోని మాచవరం పోలీస్ స్టేషన్ కు చెందిన వారమని చెబుతున్న కొందరు వ్యక్తులు వారెంట్ లేకుండా వచ్చి స్టేషన్‌కు రమ్మన్నారన్నారు . ఆ విషయాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లామన్నారు . ఈ మొత్తం వ్యవహారంపై ఓ సీనియర్ న్యాయాధికారితో విచారణ జరిపించి నివేదిక ఇవ్వాలని విశాఖ జిల్లా జడ్జిని హైకోర్టు ఇంతకుముందే ఆదేశించింది. విచారణ పూర్తి చేసిన సీనియర్ న్యాయాధికారి ఈ ఏడాది జనవరి 18న హైకోర్టుకు నివేదిక అందజేశారు. తాజాగా ఈ వ్యాజ్యం హైకోర్టులో విచారణకు వచ్చింది . నివేదికలోని అంశాల్ని పరిశీలించిన ధర్మాసనం ఈనెల 14న కోర్టుకు హాజరు కావాలని డీజీపీని ఆదేశించింది .

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details