మిషన్ బిల్డ్ ఏపీపై హైకోర్టు విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది. ప్రభుత్వం తరపున వేసిన కౌంటర్ అఫిడవిట్లు కొందరు పిటిషనర్లకు అందలేదని కోర్టుకు తెలపటంతో విచారణను హైకోర్టు వాయిదా వేసింది. గుంటూరు, విశాఖపట్నంలోని పలుచోట్ల ప్రభుత్వ ఆస్తుల విక్రయానికి ప్రభుత్వం సమాయత్తం కాగా...దీనిని సవాల్ చేస్తూ గుంటూరుకు చెందిన సామాజిక కార్యకర్త తోట సురేశ్ బాబు, తదితరులు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. తుది తీర్పునకు లోబడే ఆక్షన్ ఉండాలని గతంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వగా...తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు వీటిని కొనసాగిస్తూ తాజాగా ఆదేశాలు జారీచేసింది. పిటిషనర్ తరపున హైకోర్టు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు పిల్ దాఖలు చేశారు.
మిషన్ బిల్డ్ ఏపీపై హైకోర్టు విచారణ వచ్చే వారానికి వాయిదా
మిషన్ బిల్డ్ ఏపీపై తదుపరి విచారణను హైకోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది. ప్రభుత్వం తరపున వేసిన కౌంటర్ అఫిడవిట్లు కొంతమంది పిటిషనర్లకు అందలేదని కోర్టుకు తెలపటంతో న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది.
మిషన్ బిల్డ్ ఏపీపై హైకోర్టు విచారణ వచ్చే వారానికి వాయిదా