గుంటూరు నగరంలోని పాత గుంటూరు పోలీసు స్టేషన్ ముట్టడి ఘటనలో పలువురిపై నమోదైన కేసును ఎత్తి వేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేయటం తెలిసిందే. దీనిని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ ఘటనపై ఏపీ పోలీసులతో కాకుండా ఇతర సంస్థలతో దర్యాప్తు జరిపించాలని... పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. పిటీషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం... ప్రభుత్వం జారీ చేసిన జీవోపై స్టే విధించింది. జీవోలో ఒక వర్గం వారిని ప్రత్యేకంగా పేర్కొనటంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ...తదుపరి విచారణను అక్టోబర్ 1కి వాయిదా వేసింది.
గుంటూరు పీఎస్‌పై దాడి ఘటనలో ప్రభుత్వ జీవోపై హైకోర్టు స్టే - గుంటూరులోని పోలీసుస్టేషన్ దాడి ఘటనపై హైకోర్టు
గుంటూరులోని పోలీసుస్టేషన్‌పై దాడిచేసిన వారిపై కేసు ఎత్తివేస్తూ ఇచ్చిన జీవోపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వం జారీచేసిన జీవోపై స్టే విధించిన హైకోర్టు... కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
గుంటూరు పీఎస్ దాడి ఘటనలో ప్రభుత్వ జీవోపై హైకోర్టు స్టే