ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

AP High Court on Bandaru Satyanarayana Petition: హైకోర్టులో బండారు సత్యనారాయణ పిటిషన్‌..విచారణ నవంబర్ 1కి వాయిదా వేసిన హైకోర్టు - Bandaru Satyanarayana Latest News

AP High Court on Bandaru Satyanarayana Petition: ఏపీ హైకోర్టులో టీడీపీ నేత బండారు సత్యనారాయణ పిటిషన్‌పై విచారణ జరిగింది. తదుపరి విచారణను నవంబర్ 1కి వాయిదా వేసింది.

ap_high_court_on_bandaru_satyanarayana_petition
ap_high_court_on_bandaru_satyanarayana_petition

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 13, 2023, 10:29 AM IST

AP High Court on Bandaru Satyanarayana Petition: హైకోర్టులో బండారు సత్యనారాయణ పిటిషన్‌..విచారణ నవంబర్ 1కి వాయిదా వేసిన హైకోర్టు

AP High Court on Bandaru Satyanarayana Petition :తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బండారు సత్య నారాయణమూర్తి అరెస్టు విషయంలో పోలీసులు.. దిగువ కోర్టు, హైకోర్టులో భిన్న వివరాలు సమర్పించారని ధర్మాసనం పేర్కొంది. 41ఏ నోటీసు ఇస్తే తిరస్కరించిన కారణంగా అరెస్టు చేశామని హైకోర్టుకు చెప్పి.. సీఆర్​పీసీ 41(1)(బి) ప్రకారం నోటీసు ఇచ్చి అరెస్టు చేసే ఉద్దేశం ఉందని ఇప్పుడెలా చెబుతారని ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై లోతైన విచారణ జరిపి తగిన ఉత్తర్వులు ఇస్తామని పేర్కొంది.

Bandaru Satyanarayana Petition Hearing Postpone November 1st :బండారు సత్య నారాయణమూర్తిని అరెస్టు చేయడానికి ముందు రోజు, అరెస్టు రోజు రికార్డు చేసిన సీసీ టీవీ ఫుటేజ్, వీడియో రికార్డులను తమ ముందు ఉంచాలని పిటిషనర్, పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 1కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ తర్లాడ రాజ శేఖరావుతో కూడిన ధర్మాసనం ఈమేరకు ఉత్తర్వులు ఇచ్చింది.

Bandaru Satyanarayana Comments: ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నించడం, విమర్శించడం.. రాజకీయ నాయకుల హక్కు: బండారు

Bandaru Satyanarayana Comments on Roja :సీఎం జగన్ మోహన్ రెడ్డి , మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో బండారు సత్య నారాయణమూర్తిపై నగరంపాలెం, అరండల్ పేట ఠాణాల్లో కేసులు నమోదు చేశారు. ఈ కేసుల విషయంలో పోలీసులు సత్య నారాయణమూర్తిని అక్రమంగా నిర్బంధించారని పేర్కొంటూ ఆయన సోదరుడు బండారు సింహాద్రిరావు దాఖలు చేసిన హెబియస్ కార్పస్ వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరుపుతున్నారు.

పిటిషనర్ తరఫున న్యాయవాది వీవీ సతీష్ వాదనలు వినిపించారు. కోర్టును తప్పు దోవపట్టించేలా పోలీసులు వ్యవహరించారని అన్నారు. నోటీసుల జారీ విషయంలో మాట మార్చారని అన్నారు. వారి చర్యలు కోర్టు ధిక్కరణ కిందకు వస్తాయన్నారు. సత్య నారాయణమూర్తి ఇంటి చుట్టూ పోలీసులను మోహరించి భయబ్రాంతులకు గురి చేశారన్నారు. నిర్బంధంలో ఉంచారన్నారు. అందుకు ఆధారం సీసీటీవీ ఫుటేజ్ ఉందని తెలిపారు.
TDP Leader Bandaru Satyanarayana Murthy Arrested: బండారు సత్యనారాయణ అరెస్టు.. ముందస్తు గృహనిర్బంధాలు.. స్టేషన్ వద్ద ఆంక్షలు
పోలీసుల తరఫున న్యాయవాది వివేకానంద వాదనలు వినిపించారు. పోలీసులు సిద్ధం చేసిన నోటీసులో ఒకేసారి 41(ఏ)(1) రెడ్ విత్ 41(1) (బీ) అని పేర్కొనడం తప్పేనన్నారు. 41(1) (బీ) నోటీసు ఇచ్చి అరెస్టు చేయాలనేది దర్యాప్తు అధికారి ఉద్దేశం అన్నారు. ఆ వాదనలపై ధర్మాసనం స్పందిస్తూ.. నోటీసు ఇస్తే తిరస్కరించిన కారణంగా అరెస్టు చేసినట్లు గత విచారణలో ప్రత్యేక పీపీ కోర్టుకు చెప్పారని గుర్తు చేసింది.

ప్రస్తుతం మరోమాట చెబుతున్నారేమిటని ప్రశ్నించింది. అర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాల్సిన అవసరం పోలీసులపై ఉందని పేర్కొంది. ప్రస్తుత కేసు విషయంలో ఇప్పటికిప్పుడు తాము ఎలాంటి నిర్ణయానికి రావడం లేదని, లోతైన విచారణ జరిపి తగిన ఉత్తర్వులు ఇస్తామని పేర్కొంది. హైకోర్టు తదుపరి విచారణను నవంబర్ 1కి వాయిదా వేసింది.

Bail to Bandaru Satyanarayana: బండారు సత్యనారాయణకు బెయిల్ మంజూరు

ABOUT THE AUTHOR

...view details