AP High Court Hearing on Camp Offices Shifting: సీఎం క్యాంపు ఆపీసు, ఇతర పరిపాలనకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై నేడు హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపు నిలిపివేయాలన్న పిటిషన్‌పై విచారణ జరగగా, తదుపరి విచారణను రేపు మధ్యాహ్నానికి హైకోర్టు వాయిదా వేసింది.
డిసెంబర్ 8వ తేదీన సైతం కోర్టులో ఇరువైపులా వాదనలు వినిపించగా, న్యాయస్థానం తదుపరి విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది. ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరుతో కార్యాలయాలను విశాఖకు తరలిస్తున్నారని రాజధాని పరిరక్షణ సమితి జీవో నెం. 2283ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై స్టే ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరింది.
ప్రభుత్వం కార్యాలయాలు తరలించేందుకు యత్నిస్తోందని, మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది మురళీధర్ కోరారు. కార్యాలయాల తరలింపునకు ప్రభుత్వం అంతర్గత ఏర్పాట్లు చేస్తోందని అన్నారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం తరఫు న్యాయవాది కార్యాలయాల తరలింపు ఇప్పటికిప్పుడు ఏమీ జరగదని తెలిపారు.
'మేం విశాఖకు రాలేం!' సీఎస్‌తో తేల్చేసిన సీనియర్ ఐఏఎస్‌లు?
Camp Office Shifting to Visakhapatnam GO:సీఎం క్యాంప్ కార్యాలయాల తరలింపు, పరిపాలనకు సంబంధించి నవంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం జీవో 2283ను విడుదల చేసింది. ఆ జీవోలో విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయం, వసతి సదుపాయం, మంత్రులు, సీనియర్ అధికారులకు ట్రాన్సిట్ వసతి గుర్తింపు కోసం అధికారుల కమిటీని నియమించినట్లు తెలిపింది. ఉత్తరాంధ్ర అభివృద్ధి సమీక్షల కోసం సీఎం జగన్ విశాఖలో బస చేయాల్సి ఉన్నందున క్యాంప్ ఆఫీసు, బస గుర్తింపు కోసం ఓ కమిటీని ఏర్పాటు చేశామని విశాఖ నుంచే జగన్ పరిపాలన చేయనున్నారంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Petition in High Court against GO 2283:ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి పర్యవేక్షణ, సమీక్ష పేరుతో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోను సవాలు చేస్తూ అమరావతి పరిరక్షణ సమితి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రాష్ట్ర రాజధాని అమరావతే అంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఉల్లంఘిస్తూ కార్యాలయాలను తరలిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఉత్తరాంధ్రపై సమీక్ష కోసం - యువతకు ఉద్యోగాలనిచ్చే మిలీనియం టవర్స్ కబ్జా! అన్ని శాఖలు విశాఖకు తరలింపు
మిలేనియం టవర్స్‌ను ప్రభుత్వ కార్యాలయాలకు అనువుగా మార్చడం ఐటీ పాలసీని ఉల్లంఘనగా, విశాఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విమ్స్) ప్రాంగణాన్ని ప్రభుత్వ కార్యాలయాలుగా మార్చడాన్ని ఎన్‌ఎంసీ నిబంధనలను ఉల్లంఘనగా ప్రకటించాలని పిటిషనర్లు కోరుతున్నారు. అదే విధంగా జీవో 2283ని తక్షణమే నిలుపుదల చేసి, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై గతంలో పలుమార్లు విచారణ జరగగా, తాజాగా నేడు మరోసారి విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.
సీఎం పర్యటనతో ఐటీ ఉద్యోగులకు ముచ్చెమటలు - ఐటీ జోన్, పొలిటికల్ యాక్టివిటీ మిలీనియం టవర్స్‌లోనే?