గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు పరిధిలోని తెదేపా కేంద్ర కార్యాలయ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)ను హైకోర్టు కొట్టివేసింది.
తెదేపా కార్యాలయ నిర్మాణానికి వాగుకు చెందిన 3.65 ఎకరాల్ని 99 ఏళ్ల పాటు లీజు ప్రాతిపదికన కేటాయించారని ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్లో పేర్కొన్నారు. భూ కేటాయింపు జీవో 228ని రద్దు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. అయితే ఈ పిల్‌ను హైకోర్టు ద్విసభ్య బెంచ్ కొట్టివేసింది. గతంలోనే దీనిపై రిట్ పిటిషన్ దాఖలైనందున పిల్ అవసరం లేదని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. పిల్ వేయటంలో రామకృష్ణారెడ్డి ఆసక్తి ఏంటని ప్రశ్నించింది.