AP High Court orders: కోర్టులతో మెుట్టికాయలు వేయించుకోవడం ఆంధ్రప్రదేశ్ అధికారులు, నేతలకు పరిపాటిగా మారింది. గత కొంత కాలంగా సీఎస్ నుంచి వివిధ శాఖల అధిపతుల వరకూ కోర్టు ఆగ్రహాన్ని చవిచూడటం చూస్తునే ఉన్నాం. చేసిన తప్పిదాలకు కోర్టు బొనులో నిలబడటమో.. లేదా జరిమానాలు చెల్లించి తప్పించుకోవడం పారిపాటిగా మారుతోంది. బీఈడీ స్పాట్ ప్రవేశాలకు సంబంధించి కేసు విచారణ సందర్భంగా ఏపీ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టుకు వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. బీఈడీ స్పాట్ ప్రవేశాల్లో జరిమానా విదించడాన్ని తీవ్రంగా పరిగణించిన హైకోర్టు.. విద్యార్థికి రోజుకు రూ.2 వేల జరిమానా వేయడాన్ని తప్పుబట్టింది. జరిమానా విధించడానికి గల కారణాలను తెలపాలని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 26కు వాయిదా వేసింది.
AP High Court: వ్యక్తిగతంగా హాజరుకావాలి.. ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌కు హైకోర్టు ఆదేశం - హైకోర్టు జరిమానా
Higher educational council Chairman
19:35 June 19
బీఈడీ స్పాట్ ప్రవేశాల్లో జరిమానాను తీవ్రంగా పరిగణించిన హైకోర్టు
Last Updated : Jun 19, 2023, 8:16 PM IST