రాష్ట్రంలో కరోనా వైరస్ నిరోధక చర్యలపై వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. నెల్లూరు జిల్లాలో ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి స్థిమితంగా ఉందని తెలిపారు. 14 రోజుల తర్వాత మళ్లీ నమూనాను పరీక్షించాక డిశ్చార్జ్ చేస్తామని పేర్కొన్నారు. పాజిటివ్ ఉన్న వ్యక్తి కలిసిన ఐదుగురినీ 14 రోజులు ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతామని జవహర్‌రెడ్డి చెప్పారు. పూర్తి స్థాయిలో మాస్కులు అందుబాటులో ఉంచినట్లు తెలిపిన ఆయన.. కరోనా అనుమానితుల వివరాలు తెలిపేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఎలాంటి సందేహం, సమాచారం ఉన్నా... 0866-2410978కు నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
విదేశాల నుంచి వచ్చేవారు ఇవి పాటించండి
కొవిడ్-19 (కరోనా వైరస్) ప్రభావిత దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు వ్యాధి లక్షణాలున్నా.. లేకపోయినా కచ్చితంగా 28 రోజుల పాటు ఇళ్లల్లోనే ఉండాలని జవహర్‌రెడ్డి సూచించారు. కుటుంబ సభ్యులతోగానీ, ఇతరులతో గానీ కలవకూడదని అన్నారు. అన్ని జిల్లాల్లోనూ కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశామని చెప్పారు. కొవిడ్-19 అనుమానిత కేసుల విషయంలో జిల్లా వైద్యాధికారులు, రాపిడ్ రెస్పాన్స్ టీంలు మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని అన్నారు.
వైద్యుల పరిశీలనలో 561 మంది