గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన సెట్‌బ్యాక్ ప్రాంతంలో అక్రమంగా కార్యాలయం నిర్మిస్తున్నారంటూ దాఖలైన వ్యాజ్యంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే షేక్ మహమ్మద్ ముస్తఫాకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. పూర్తి వివరాలు సమర్పించాలని కార్పొరేషన్ అధికారులను ఆదేశించింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశాలిచ్చింది. కార్పొరేషన్‌కు చెందిన రెడ్ ట్యాంక్ కాంప్లెక్స్ వద్ద ఉన్న సెట్‌బ్యాక్ ప్రాంతంలో వైకాపా ఎమ్మెల్యే ముస్తఫా అక్రమ నిర్మాణం చేపడుతున్నారని పేర్కొంటూ గుంటూరుకు చెందిన వ్యాపారి షేక్ అబ్దుల్ కరీం హైకోర్టులో పిల్ వేశారు.
అక్రమ నిర్మాణ వ్యవహారంలో వైకాపా ఎమ్మెల్యేకు నోటీసులు
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన సెట్‌బ్యాక్ ప్రాంతంలో అక్రమంగా కార్యాలయం నిర్మిస్తున్నారంటూ దాఖలైన వ్యాజ్యంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే షేక్ మహమ్మద్ ముస్తఫాకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. పూర్తి వివరాలు సమర్పించాలని కార్పొరేషన్ అధికారులను ఆదేశించింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
పిటిషనర్ తరఫు న్యాయవాది డీఎస్‌ఎన్‌వీ ప్రసాదబాబు వాదనలు వినిపిస్తూ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్‌కు, సమాచార హక్కు చట్టం కింది ఇచ్చిన వివరాలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. భూమిని వ్యాపార నిమిత్తం ఎమ్మెల్యేకి లీజుకు ఇచ్చామన్నారు. అందులో ఏ తరహా వ్యాపారం చేస్తారని ధర్మాసనం అడిగిన ప్రశ్నకు.. కార్యాలయం ఏర్పాటు చేస్తారని బదులిచ్చారు. ఆ నిర్మాణానికి ప్లాన్ ఉందా అని ధర్మాసనం మరోసారి ప్రశ్నించగా.. అఫిడవిట్ వేస్తామన్నారు. అందుకు ధర్మాసనం అంగీకరించింది.
ఇదీ చదవండి:నేటి నుంచి 45 ఏళ్లు పైబడిన వారికి టీకా
TAGGED:
గుంటూరు జిల్లా న్యూస్