ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రైవేటు ఉపాధ్యాయులను ఆదుకోలేకపోయాం: అజేయ కల్లం - ప్రైవేటు ఉపాధ్యాయులపై అజయ్ కల్లం వ్యాఖ్యలు

కరోనా కష్ట కాలంలో ప్రైవేటు ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ప్రభుత్వ సలహాదారుడు అజేయ కల్లం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున వారిని ఆదుకోలేకపోయామని వ్యాఖ్యానించారు.

AJAY_KALLAM
AJAY_KALLAM

By

Published : Dec 13, 2020, 5:19 PM IST

ప్రైవేటు ఉపాధ్యాయులను ఆదుకోలేకపోయాం: అజేయ కల్లం

కరోనా కష్ట కాలంలో అన్ని రంగాల వారిని ఆదుకున్న ప్రభుత్వం... ప్రైవేటు ఉపాధ్యాయులను ఆదుకోలేకపోయామని ప్రభుత్వ సలహాదారుడు అజేయ కల్లం అన్నారు. గుంటూరు జిల్లాలో బొమ్మిడాల కృష్ణమూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అజేయ కల్లం మాట్లాడారు. కొవిడ్ వల్ల ప్రయివేట్ సంస్థల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు ఉపాధి కోల్పోయారని.. చాలా ఇబ్బందులు పడ్డారని చెప్పారు. ఇలాంటి క్లిష్ట సమయంలో ఉపాధ్యాయులకు ఆర్థిక సాయం అందజేసిన ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు.

యాజమాన్యాలు కూడా ఉపాధ్యాయులను ఆదుకునేందుకు ముందుకు రావాలన్నారు. ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని మద్య విమోచన ప్రచార కమిటీ ఛైర్మన్ లక్ష్మణ్ రెడ్డి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details