కరోనా మహమ్మారి కారణంగా వలస కూలీలు తమ స్వస్థలాలకు తిరుగు ప్రయాణం అవుతున్నారు. పొట్టచేత పట్టి బిహార్, ఒడిశా, జార్ఖండ్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వలస కూలీలు సొంతూళ్లకు తిరిగి వెళ్తున్నారు. కరోనా వ్యాధి నివారణకు తీసుకున్న చర్యల్లో భాగంగా లాక్ డౌన్ విధించటంతో వారు ఇబ్బందులకు గురవుతున్నారు.
శ్రామిక రైలు ద్వారా స్వస్థలాలకు వలస కూలీలు - guntur corona cases news
కరోనా వ్యాప్తితో దేశమంతా లాక్డౌన్ కొనసాగుతోంది. దీంతో అనేక మంది వలస కూలీలు ఉపాధి కోల్పోయి నానా తిప్పలు పడుతున్నారు. వలస కూలీలను వారి స్వస్థలాలకు పంపిస్తుంది ప్రభుత్వం. శ్రామిక రైలు ద్వారా కూలీలను సొంతూళ్లకు చేరవేస్తుంది.
రాష్ట్ర ప్రభుత్వం శ్రామిక రైలు ద్వారా వారిని వారి రాష్ట్రాలకు పంపుతుంది. గుంటూరు జిల్లా నుంచి ఇప్పటికే 6 వేలమందిని వారి ప్రాంతాలకు తరలించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న బిహార్‌కు చెందిన వారిని శుక్రవారం అర్ధరాత్రి తరువాత బీహార్ కు పంపారు. జిల్లా సంయుక్త పాలనాధికారి దినేష్ కుమార్ వలస కూలీలతో మాట్లాడారు. వారు కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
తమను స్వస్థలాలకు తరలించడం పట్ల బిహార్ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నెల రోజులకు పైగా పనులు లేకపోయినా తమకు ఆహారం అందించారని... ఇప్పుడు తమను ప్రభుత్వ సహకారంతో పంపటం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి:మరో ఘోరం: సొంతగూటికి చేరేలోగా మృత్యు ఒడికి!