పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మంగళవారం రాత్రి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ 2 రహస్య జీవోలు జారీ చేసింది. పంచాయతీ ఎన్నికల సంస్కరణ ఆర్డినెన్స్‌కు సకాలంలో శాసనసభ, మండలి ఆమోదం లభించకపోవటంతో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రెండోసారి మళ్లీ అర్డినెన్స్ తెచ్చిన విషయం తెలిసిందే. తదుపరి చర్యల్లో భాగంగానే ఈ 2 జీవోలు జారీ చేశారా? వీటిలో కొత్త నిర్ణయాలు ఏమైనా ఉన్నాయా? అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
మంగళవారం రాత్రి 10 గంటల తరువాత వెలువడిన జీవోలు 12 గంటల వరకు ఖాళీ సమాచారంతో కనిపించాయి. వీటిపై బుధ, గురువారాల్లో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు.