ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

AP Government Once Again Actions on Margadarsi: మార్గదర్శిపై ఏపీ ప్రభుత్వం మరోమారు కక్ష సాధింపు చర్యలు.. కోర్టు ఆదేశాలు లెక్క చేయకుండా - AP CID Raids at Kadapa Margadarsi Branch

AP Government Once Again Actions on Margadarsi: మార్గదర్శిపై మరోమారు ఏపీ ప్రభుత్వం కక్షసాధింపులకు పాల్పడింది. సంస్థ దైనందిన కార్యకలాపాలు, వ్యాపార లావాదేవీలు, కస్టమర్లకు ఎటువంటి అవరోధాలు సృష్టించరాదని.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టమైన మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే తనిఖీలు నిర్వహించేటప్పుడు.. కార్యాలయాల గేట్లు, షట్టర్లు మూసివేయరాదని స్పష్టం చేసింది. అయినా.. సీఐడీ అధికారులు.. న్యాయస్థానం ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ సంస్థపై దాడులకు తెగబడుతున్నారు. సంస్థ సిబ్బందితోపాటు కస్టమర్లకూ ఇబ్బందుకు సృష్టిస్తున్నారు.

AP_Government_Once_Again_Actions_on_Margadarsi
AP_Government_Once_Again_Actions_on_Margadarsi

By

Published : Aug 17, 2023, 2:43 PM IST

Updated : Aug 17, 2023, 5:40 PM IST

AP Government Once Again Actions on Margadarsi: మార్గదర్శిపై ఏపీ ప్రభుత్వం మరోమారు కక్ష సాధింపు చర్యలు.. కోర్టు ఆదేశాలు లెక్క చేయకుండా

AP Government Once Again Actions on Margadarsi: మార్గదర్శిపై మరోమారు ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపులకు తెగబడింది.సంస్థ దైనందిన కార్యకలాపాలు, వ్యాపార లావాదేవీలు, కస్టమర్లకు ఎలాంటి అవరోధాలు సృష్టించరాదన్న ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను అధికారులు ఉల్లంఘించారు. తనిఖీలు నిర్వహించేటప్పుడు.. కార్యాలయాల గేట్లు, షట్టర్లు మూసివేయరాదని ఇచ్చిన ఉత్తర్వులనూ పట్టించుకోలేదు. న్యాయస్థానం ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ సీఐడీ అధికారులు సంస్థపై దాడులకు తెగబడుతున్నారు. సంస్థ సిబ్బందితోపాటు కస్టమర్లకూ ఇబ్బందులు సృష్టిస్తున్నారు.

AP CID Raids at Tirupati Margadarsi Branch:తిరుపతి కార్యాలయంలో కస్టమర్లను కార్యాలయంలోకి రానీయకుండా.. బ్రాంచి షట్టర్లు మూసివేశారు. ఉదయం మూసివేసిన షట్టర్లను మధ్యాహ్నం రెండు గంటలకు తెరిచారు. ఉదయం కస్టమర్లను అనుమతించలేదు. న్యాయవాది కోర్టు ఉత్తర్వులను చూపడంతో... కస్టమర్లను అనుమతించారు. నగదు చెల్లించడానికి వచ్చిన ఓ చందాదారును సీఐడీ అధికారులు విచారించారు. ఇంటి పేరు, ఫోన్‌ నెంబర్‌, పూర్తి పేరు, సంతానం వంటి పలు రకాల ప్రశ్నలు సంధించారు.

Supreme Court on Margadarsi Case: 'మార్గదర్శి చిట్‌ఫండ్‌ కేసు బదిలీ కుదరదు'.. ఏపీ ప్రభుత్వానికి స్పష్టం చేసిన సుప్రీంకోర్టు

AP CID Raids at Labbipeta Margadarsi Branch:విజయవాడ లబ్బిపేట బ్రాంచి వద్దకు వచ్చిన పోలీసు, రెవెన్యూ అధికారులు అక్కడ విజువల్స్‌ తీస్తున్న మీడియాను అడ్డుకున్నారు. బ్రాంచిలోకి ఖాతాదారులను అనుమతించలేదు. గవర్నర్‌పేట బ్రాంచిలోకి రెవెన్యూ, పోలీసులతో పాటు ఇతర అధికారులు వచ్చారు. కార్యాలయంలోకి ఎవరూ రాకుండా కానిస్టేబుళ్లు... మఫ్టీలో గస్తీ కాశారు. విజయవాడ వన్‌ టౌన్‌ బ్రాంచి పరిసరాల్లోకీ అధికారులు ఎవరినీ రానీయలేదు. లోపల సీసీటీవీ కెమెరాలను ఆపివేయించారు. అన్ని బ్రాంచీల్లోనూ సిబ్బంది వద్ద నుంచి మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

AP CID Raids at Guntur Margadarsi Branch:ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని 5 మార్గదర్శి కార్యాలయాల్లో తనిఖీలు చేస్తున్నారు. మార్గదర్శి చందాదారులకు ఎలాంటి ఆటంకాలు కల్పించరాదని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను గుంటూరులోనూ అధికారులు లెక్క చేయలేదు. అరండల్‌పేట బ్రాంచీలోకి కస్టమర్లను రానివ్వకుండా... సీఐడీ, రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు... షట్టర్లు మూసివేశారు. అలాగే నరసరావుపేట, తెనాలి బ్రాంచి కార్యాలయాల షట్టర్లనూ అధికారులు మూసివేశారు. అన్ని శాఖల కార్యాలయాల్లోనూ తనిఖీల సమయంలో సిబ్బంది నుంచి మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

Margadarsi Case: 'మార్గదర్శి మూసివేతకు ఏపీ ప్రభుత్వ కుట్ర.. చట్టనిబంధనల ముసుగులో కక్షసాధింపు'

AP CID Raids at Anantapur Margadarsi Branch:అనంతపురంలోని మార్గదర్శి కార్యాలయానికి... ఉదయం 11 గంటల 10 నిమిషాల సమయంలో... సీఐడీ, అగ్నిమాపకశాఖ, రిజిస్ట్రేషన్‌ అధికారులు, పోలీసులు... దాదాపు 10 మంది చేరుకున్నారు. సోదాల సమయంలో... మార్గదర్శి సిబ్బంది తప్ప మరెవరూ ఉండకూడదంటూ.. ఈటీవీ, ఈనాడు ప్రతినిధులను వెళ్లిపోవాలనిచెప్పారు. దర్యాప్తునకు, విచారణకు అడ్డురాబోమని అధికారులకు వివరించినా... ఉండటానికి వీల్లేదంటూ పోలీసులతో బయటకు పంపించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు మరింత అత్యుత్సాహం ప్రదర్శించి... వారిని బయటకు లాగేందుకు యత్నించారు. కర్నూలు మార్గదర్శి కార్యాలయంలో ఉదయం నుంచి వివిధ శాఖల అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సీఐడీ సీఐ డేగల ప్రభాకర్‌, ఎస్సై శ్రీనివాసులు, రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు... మార్గదర్శి మేనేజర్‌ను ఆయన ఛాంబర్‌లో ప్రశ్నిస్తున్నారు.

AP CID Raids at Kadapa Margadarsi Branch:కడప మార్గదర్శి కార్యాలయానికి సీఐడీ అధికారులు.., తమతో చిట్ రిజిస్ట్రార్, ఇతర సిబ్బందిని తీసుకొచ్చారు. సీఐడీ అధికారులు కార్యాలయంలోకి వచ్చాక.. ఫోన్లో పై అధికారులతో మాట్లాడుతూ వారి నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారు. మార్గదర్శి సిబ్బంది విధులను అధికారులు అడ్డుకున్నారు. వారి మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కస్టమర్లను మొదట అడ్డుకోగా... న్యాయవాదులు కోర్టు ఉత్తర్వులు చూపడంతో తిరిగి అనుమతించారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మార్గదర్శి కార్యాలయంలో... ఏడుగురు అధికారుల బృందం... సోదాలు నిర్వహిస్తోంది. తిరుపతికి చెందిన సీఐడీ, కడపకు చెందిన చిట్‌ రిజిస్ట్రార్‌, రిజిస్ట్రేషన్‌ శాఖల అధికారులు... చిట్స్‌కు సంబంధించిన పలు వివరాలపై ఆరా తీస్తున్నారు.

margadarshi chitfund : 'ఉల్లంఘనలు అబద్ధం.. ప్రభుత్వ దాడి నిజం'

AP CID Raids at Nellore Margadarsi Branch:నెల్లూరులోని రెండు మార్గదర్శి బ్రాంచి కార్యాలయాలపై వివిధ శాఖలకు చెందిన అధికారులు తనిఖీలు చేపట్టారు. నర్తకి సెంటర్‌లోని బ్రాంచ్‌కి అధికారులందరూ ఒక్కసారిగా వాహనాల్లో రావడంతో... చుట్టుపక్కల ఉన్న దుకాణాల వారు, మార్గదర్శి ఖాతాదారులు హడలిపోయారు. వేదాయపాలెం బ్రాంచ్‌ కార్యాలయం భవనంలోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న దుకాణదారులను ప్రశ్నలతో అధికారులు ఇబ్బంది పెట్టారు. కొందరు అధికారులు... కార్యాలయం బయట... మార్గదర్శి చందాదారులతో మాట్లాడారు. ఒంగోలు మార్గదర్శి చిట్‌ఫండ్‌ కార్యాలయంలో... రిజిస్ట్రార్, రెవెన్యూశాఖల సిబ్బంది.. మేనేజర్‌ను పలు వివరాలు అడిగారు. మార్గదర్శికి సంబంధించిన ఇద్దరు న్యాయవాదులను మేనేజర్‌ గది నుంచి బయటకు పంపారు. సిబ్బంది ఫోన్లు స్విచాఫ్ చేయించారు.

AP CID Raids at Visakha Margadarsi Branch:అనకాపల్లి, విశాఖ సీతంపేట డాబా గార్డెన్స్ తదితర బ్రాంచీల్లో తనిఖీల పేరుతో వివిధ శాఖలకు చెందిన అధికారులు చేరుకుని హడావుడి వాతావరణం సృష్టించారు. గాజువాక బ్రాంచ్‌ వద్ద పోలీసులు కింద ఉండి.. వచ్చే వారిని వివరాలు అడిగారు. ఉద్యోగులు ఎవరి సీట్లలో వారు కూర్చోవాలని చెప్పి... వారి నుంచి మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ N.A.D. బ్రాంచిలో షట్టర్లు, తలుపులు మూసివేశారు. షట్టర్‌ మూసివేసి ఉందని చెప్పి... కస్టమర్లను లోపలికి రానివ్వలేదు. మార్గదర్శి సిబ్బంది నుంచి మొబైల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కూర్మన్నపాలెం, మధురవాడ బ్రాంచిల సిబ్బంది నుంచీ ఫోన్లు తీసేసుకున్నారు.

Margadarshi: ఈనాడుపై కక్షతోనే మార్గదర్శి సంస్థపై సీఐడీ ఏఫ్​ఐఆర్​లు​

AP CID Raids at Rajamahendravaram Margadarsi Branch:ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని మార్గదర్శి సంస్థ పలు బ్రాంచీల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. సీఐడీ, రిజిస్ట్రేషన్ అధికారులు తమ వెంట రెవిన్యూ సహా పలు శాఖలకు సంబంధించిన అధికారులను వెంటేసుకుని వచ్చారు. రాజమహేంద్రవరం మార్గదర్శి కార్యాలయ భవన లీజు వివరాలను అడిగి తెలుసుకున్నారు. బ్రాంచి బయట గ్రిల్‌ను ఉదయం మూసివేసిన అధికారులు మధ్యాహ్నం తెరిచారు. కాకినాడ బ్రాంచిలో మొదట కొంతసేపు గ్రిల్‌ మూసివేసి ఆ తర్వాత తీసినా... కస్టమర్లను మాత్రం అనుమతించలేదు. సిబ్బంది నుంచి మొబైల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మండపేట బ్రాంచిలోనూ కస్టమర్లను అనుమతించడం లేదు. కస్టమర్లను.. రేపు రమ్మని చెప్పి తిప్పిపంపుతున్నారు. సిబ్బంది నుంచి ఫోన్లు తీసుకున్నారు. అమలాపురంలోనూ వివిధ శాఖల అధికారులు రికార్డులు పరిశీలిస్తున్నారు. మండపేట నుంచి పలు దస్త్రాలు తీసుకొచ్చి... రికార్డులన్నీ పరిశీలిస్తున్నారు.

AP CID Raids at Eluru Margadarsi Branch:ఏలూరు, తణుకు, భీమవరం కార్యాలయాలకు... సీఐడీ, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ, రెవెన్యూ, పోలీసు అధికారులు తమతోపాటు పలు దస్త్రాలను కార్యాలయాలకు తీసుకొచ్చారు. తణుకు మార్గదర్శి కార్యాలయం లోపలికి ఖాతాదారులను అనుమతించలేదు. ఇద్దరు కస్టమర్లను మళ్లీ రమ్మని చెప్పి పంపగా.. వారు వెళ్లిపోయారు.

Margadarsi: మార్గదర్శిపై మరో పెద్ద కుట్ర.. ష్యూరిటీలు సమర్పించని చందాదారు ఫిర్యాదు ఆధారంగా పోలీసుల కేసు..

AP CID Raids at Vizianagaram Margadarsi Branch:విజయనగరం మార్గదర్శి కార్యాలయ భవనానికి సంబంధించిన అన్ని రకాల అనుమతులు, నిబంధనలను అధికారులు పరిశీలించారు. భవనం అన్ని వైపులా కొలతలు నిర్వహించారు. పలు దస్త్రాలు, ఆర్థిక లావాదేవీలు, ఇతర వివరాలపై ఆరా తీస్తున్నారు. చిట్‌ వాయిదాలు చెల్లించే ఖాతాదారులను... అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాకే... లోపలికి అనుమతిస్తున్నారు. శ్రీకాకుళం రామలక్ష్మణకూడలిలో ఉన్న మార్గదర్శి కార్యాలయంపై దాడులు విజిలెన్స్‌, రిజిస్ట్రేషన్‌, వాణిజ్య పన్నుల శాఖ, స్థానిక పోలీసులు మొత్తం 18 మంది వచ్చారు. భవనం యజమానికి కార్యాలయం వద్దకు రమ్మని పిలిచారు.

AP CID Raids at Margadarsi:రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మార్గదర్శి బ్రాంచీల వద్ద తనిఖీల పేరుతో హడావుడి వాతావరణం సృష్టిస్తూ ఆయా శాఖల అధికారులు మార్గదర్శి కార్యకలాపాలకు అడ్డంకులు సృష్టిస్తున్నారు. కోర్టు ఆదేశాలను పాటించకుండా వ్యవహరిస్తున్నారు.

Margadarsi Case Updates: మార్గదర్శిపై ఏపీ సీఐడీ చీఫ్​ శివాలు.. మైనర్‌ బాలికలతో చందాదారుల పోలిక

Last Updated : Aug 17, 2023, 5:40 PM IST

ABOUT THE AUTHOR

...view details