రాష్ట్ర ప్రభుత్వం మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉద్యోగ విరమణకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. అఖిల భారత సర్వీసులోని 1983 బ్యాచ్‌కు చెందిన ఎల్వీ సుబ్రహ్మణ్యం... ఈనెల 30న ఉద్యోగ విరమణ చేయాల్సి ఉందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నెల 30న ఆయన్ని సర్వీసు నుంచి రిలీవ్ చేయనున్నట్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యం..లాక్ డౌన్ వల్ల రవాణాకు వీలు లేకపోవటంతో బాపట్ల మానవ వనరుల అభివృద్ధి శిక్షణా సంస్థ డైరెక్టర్‌గా ఆన్లైన్లో ఛార్జ్ తీసుకుని అనంతరం పదవీ విరమణ చేసేందుకు వీలుగా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.
ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉద్యోగ విరమణ ఉత్తర్వులు జారీ - మాజీ సీఎస్ సుబ్రహ్మణ్యం వార్తలు
ఏపీ మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉద్యోగ విరమణకు సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నెల 30న ఆయన్ని సర్వీసు నుంచి రిలీవ్ చేయనున్నట్టు స్పష్టం చేసింది.
Former CS LV Subramaniam