రాష్ట్రంలో పర్యావరణ నియమాలు, నిబంధనలను కచ్చితంగా అమలు చేయడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ పర్యావరణ నిర్వహణ కార్పొరేషన్(ఏపీఈఎంసీ) ప్లాట్‌ఫామ్‌ని సీఎం జగన్ ఇవాళ ప్రారంభించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో లాంఛనంగా ప్రారంభించారు. దేశంలోనే మొదటిసారిగా ఆన్‌లైన్ వేస్ట్ ఎక్సేంజ్ ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేశామని.... దీనిద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాల నిర్వహణ బాధ్యతలను ఏపీఈఎంసీ చేపట్టనున్నట్లు చెప్పింది. వ్యర్థాల నిర్వహణలో కచ్చితమైన ట్రాకింగ్, స్క్రూటినీ, ఆడిటింగ్ ప్రక్రియలు జరుగుతాయని వివరించింది. వ్యర్థాలను ప్రాసెస్ చేసే విధానాలకు ప్రోత్సాహం అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సీఎం కార్యాలయం తెలిపింది.మంత్రులు మేకపాటి గౌతమ్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, బాలినేని శ్రీనివాసరెడ్డితోపాటు సీఎస్ నీలం సాహ్ని, పర్యావరణ, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఏపీఈఎంసీ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించిన సీఎం జగన్ - ఏపీలో ఆన్‌లైన్ వేస్ట్ ఎక్స్ఛేంజ్ ప్లాట్‌ఫాం వార్తలు
దేశంలోనే మొదటిసారిగా ఆన్‌లైన్ వేస్ట్ ఎక్స్ఛేంజ్ ప్లాట్‌ఫాంను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ దీనిని ప్రారంభించారు. పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాల నిర్వహణ బాధ్యతలను ఈ ప్లాట్‌ఫాం చేపట్టనుంది.
cm jagan