ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉద్యోగుల సీపీఎస్​ ఖాతా "నిల్​".. 11 నెలలుగా ప్రాన్‌ ఖాతాలో జమ చేయని ప్రభుత్వం - సీపీఎస్​ సొమ్ము

NO MONEY FOR PRAN ACCOUNTS: సీపీఎస్​ రద్దు చేస్తారని ఆశపడిన ప్రభుత్వ ఉద్యోగులకు.. ఉన్నదీ పోయిందన్నట్లుగా పరిస్థితులు వచ్చాయి. అంతే కాదు, డీఏ చెల్లింపులపై కూడా ప్రస్తుతానికి ప్రభుత్వం నుంచి మొండి చేయి కనిపిస్తోంది. తాజాగా ఉద్యోగులకు ముచ్చెమటలు పట్టించే చర్యలు వెలుగులోకి వచ్చింది. ఉద్యోగుల జీతాల నుంచి మినహాయించుకున్న సొమ్ములు సైతం ప్రభుత్వం పక్కదారికి మళ్లించింది. దీనికి తోడు ప్రభుత్వం చెల్లించాల్సిన ప్రాన్‌ ఖాతాలకు 11 నెలలుగా నగదు జమ చేయడం లేదని తెలిసింది. దీంతో ఉద్యోగుల్లో గుబులు రేగుతోంది.

NO MONEY FOR PRAN ACCOUNTS
NO MONEY FOR PRAN ACCOUNTS

By

Published : Feb 23, 2023, 8:26 AM IST

NO MONEY FOR PRAN ACCOUNTS: అధికారంలోకి వచ్చిన వారంలోనే సీపీఎస్​(CPS)ను రద్దు చేస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన జగన్..ఇప్పుడు అది నిలబెట్టుకోకపోగా.. కొత్త ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. వారి జీతాల నుంచి మినహాయించిన డబ్బులను సైతం ఇతర అవసరాలకు.. ప్రభుత్వం వాడేసుకుంటోంది. ప్రభుత్వం ప్రతి నెల సీపీఎస్​ ఉద్యోగుల జీతాల నుంచి 10 శాతం నగదు మినహాయిస్తోంది. దీనికి.. ప్రభుత్వ వాటా మరో పది శాతం కలిపి శాశ్వత పదవీ విరమణ ప్రాన్‌ ఖాతాల్లో.. జమ చేయాల్సి ఉంటుంది. ఐతే.. గత 11 నెలలుగా ఈ సొమ్ములు ప్రాన్‌ ఖాతాల్లో జమ కావడం లేదు.

10 శాతం లోపు ఉద్యోగులకు మాత్రమే 2022 ఏప్రిల్‌, మే నెలలకు సంబంధించిన సొమ్ము జమైనట్లు ఉద్యోగులు చెప్తున్నారు. ప్రతి నెలా ఉద్యోగుల జీతాల నుంచి మినహాయించే సొమ్ము 120 కోట్ల రూపాయలు ఉండగా.. ప్రభుత్వం ఇచ్చే వాటా మరో రూ.120 కోట్లు కలిపి మొత్తం 240 కోట్లు.. ప్రాన్ ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుంది. అయితే 11 నెలలుగా ఉద్యోగుల జీతాల నుంచి మినహాయించిన రూ.1,320 కోట్లే ప్రభుత్వం వాడేసుకుంది. అంటే రెండు వాటాలు కలిపి సుమారు 2వేల 600 కోట్లు ప్రాన్‌ ఖాతాలకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ఈ నగదు ఎప్పుడు చెల్లిస్తోందో.. తెలియడం లేదని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సీపీఎస్​ సొమ్ము పరిస్థితి ఇలా ఉంటే.. ఉద్యోగులకు నగదు రూపంలో చెల్లించాల్సిన డీఏ బకాయిలూ చెల్లించడం లేదు. బకాయిలు ఇవ్వకుండానే వాటిపై వచ్చే ఆదాయపు పన్ను మాత్రం మినహాయించుకోవడం విశేషం. పీఆర్సీ కన్నా ముందు ఇవ్వాల్సిన బకాయిలే రూ.960 కోట్లు ఉన్నాయి. వీటిలో 90 శాతం ఉద్యోగులకు.. నగదు రూపంలో ఇవ్వాల్సి ఉంది. మరో 10 శాతం ప్రాన్ ఖాతాకు జమ చేయాలి. ఈ చర్యలతో తమ పదవీ విరమణ ప్రయోజనాలు దెబ్బతింటాయని.. ఉద్యోగులు వాపోతున్నారు.

2019 నుంచి సీపీఎస్​ ఉద్యోగుల ప్రాన్‌ ఖాతాకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన వాటా.. 14 శాతానికి పెంచాలని కేంద్రం నోటిఫికేషన్‌ ఇచ్చింది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడం వల్ల ఉద్యోగులు ప్రతి నెలా 4 శాతం నష్టపోతున్నారు. మరో వైపు.. సచివాలయ ఉద్యోగుల్లో రెగ్యులరైజ్ అయిన 96వేల మంది వేతనాల నుంచి సీపీఎస్​ కోసం.. ప్రభుత్వం నగదు మినహాయిస్తోంది. ఒక్కో ఉద్యోగి నుంచి 2వేల 700 మినహాయిస్తున్నా.. ఆ సొమ్ము ప్రాన్ ఖాతాలో జమకావడం లేదని ఉద్యోగులు తెలిపారు. కింద తీసుకున్న సొమ్మును.. వడ్డీతో సహా చెల్లించాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.

సీపీఎస్​ ఖాతా "నిల్​"..

ABOUT THE AUTHOR

...view details