ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

E-Stamps in Registration: ఈ-స్టాంప్ విధానం.. నకిలీ స్టాంప్‌ పేపర్లకు చెక్

E Stamps in AP: ఈ- స్టాంప్ విధానం కోసం రాష్ట్ర ప్రభుత్వం స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది. స్టాంప్‌ల కొరత, నకిలీ స్టాంప్‌ల విక్రయం, ట్యాంపరింగ్.. వంటి సమస్యలకు ఈ-స్టాంప్ చెక్ పెడుతుందంటున్నారు అధికారులు. ఈ- స్టాంపుల ప్రత్యేకతలు, నకిలీల నుంచి రక్షణ కోసం తీసుకుంటున్న జాగ్రత్తలపై ప్రత్యేక ఈ టీవీ భారత్ కథనం.

E Stamps in AP
E Stamps in AP

By

Published : Jun 12, 2023, 6:10 PM IST

ఈ-స్టాంప్‌లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం

E Stamps in Registration and Stamps Department: రిజిస్ట్రేషన్ల వ్యవహారాలకు సంబంధించి.. స్టాంప్‌ల కొరత, నకిలీ స్టాంప్‌ల విక్రయం, ట్యాంపరింగ్ వంటి సమస్యలకు ఈ- స్టాంప్ చెక్ పెడుతుందంటున్నారు అధికారులు. నాన్ జ్యుడీషియల్ స్టాంపు పేపర్ల కన్నా.. వీటి వల్ల ఎక్కువ లాభాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇటీవలే అందుబాటులోకి వచ్చిన ఈ- స్టాంపుల ప్రత్యేకతలు, నకిలీల నుంచి రక్షణ కోసం తీసుకుంటున్న జాగ్రత్తలపై ప్రత్యేక కథనం.

స్టాంప్‌ పేపర్లు నాలుగైదు రకాలుగా ఉంటాయి. వీటిలో నాన్ జ్యుడిషియల్ స్టాంప్‌ పేపర్లను దస్తావేజుల తయారీ కోసం వినియోగిస్తారు. భూములతో పాటు ఇతర ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్లకు సంబంధించి వీటిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే తరచుగా స్టాంప్‌ పేపర్ల కొరత ఏర్పడుతోంది. ఒక్కోసారి మనకు కావాల్సిన విలువ గల స్టాంప్‌ పేపర్లు అందుబాటులో ఉండటం లేదు. పైగా పాత తేదీలతో కొనుగోలు చేసి... తప్పుడు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అన్నింటికీ మించి వీటి తయారీ వ్యయం ఎక్కువే. 10 రూపాయల స్టాంప్ పేపర్ తయారీకి 23 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. నాసిక్‌లోని ప్రింటిగ్ ప్రెస్‌లో మాత్రమే తయారు చేస్తారు. అక్కడినుంచి తీసుకురావాలి. ఇదంతా వ్యయప్రయాసలతో కూడిన పనిగా చెప్పవచ్చు.

అందుకోసమే కేంద్ర ప్రభుత్వం ఈ- స్టాంప్ విధానానికి రెండేళ్ల క్రితం అనుమతిచ్చింది. మొదట్లో కొన్ని రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా ఈ-స్టాంప్‌ విధానం అమలైంది. మన రాష్ట్రంలో ఈ ఏడాది నుంచి ఈ-స్టాంప్‌ల ద్వారా రిజిస్ట్రేషన్లకు అనుమతించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థ తరపున స్టాంప్ వెండర్లకు ఈ-స్టాంప్‌లకు అనుమతి ఇస్తారు. వాటర్ మార్క్, 1బీ హాలోగ్రాం, బార్ కోడ్, మైక్రో ప్రింట్స్ వంటి సెక్యూరిటీ ఫీచర్స్ అన్నీఈ- స్టాంపుల్లో ఉంటాయి. అమ్మినవారు, కొనేవారి పేర్లు స్టాంపుపై ముద్రించి వస్తాయి. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నందున.. టాంపరింగ్ సాధ్యం కాదని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చెబుతున్నారు.

'10 రూపాయల స్టాంప్ పేపర్ తయారీకి 23 రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చేది. కేంద్ర ప్రభుత్వం ఈ- స్టాంప్ విధానానికి రెండేళ్ల క్రితం అనుమతిచ్చింది. మొదట్లో కొన్ని రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా ఈ-స్టాంప్‌ విధానం అమలైంది. వాటర్ మార్క్, 1బీ హాలోగ్రాం, బార్ కోడ్, మైక్రో ప్రింట్స్ వంటి సెక్యూరిటీ ఫీచర్స్ అన్నీఈ- స్టాంపుల్లో ఉంటాయి. అమ్మినవారు, కొనేవారి పేర్లు స్టాంపుపై ముద్రించి వస్తాయి. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నందున... టాంపరింగ్ సాధ్యం కాదు.'- జి.శ్రీనివాసరావు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ

స్టాంపు పేపర్ల కొనుగోలుకు ప్రజలు గతంలో తీవ్రంగా ఇబ్బందులుపడేవారు. స్టాంపుల కృత్రిమ కొరత కారణంగా ఒక్కోసారి అధిక డబ్బులు చెల్లించి బ్లాక్‌లో కొనాల్సిన పరిస్థితి ఉండేది. బ్యాంకులో చలానా కట్టడానికి లైన్లలో నిలబడేవారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ-స్టాంపులు ప్రజలకు ఊరటనిస్తున్నాయి. నాన్ జ్యుడిషియల్‌కు ఉన్న చట్టబద్ధత ఈ- స్టాంపునకూ ఉంటుంది. స్టాంప్‌ వెండర్లతో పాటు కామన్ సర్వీస్ సెంటర్లలో ఈ-స్టాంప్‌లు అందుబాటులో ఉంటాయి. తమకు ఎంతో కొంత కమిషన్ వచ్చేలా చూస్తే కొత్త విధానం ఎంతో బాగుంటుందని స్టాంప్‌ వెండర్లు చెబుతున్నారు. స్టాంప్‌ పేపర్ల తయారీ ఖర్చు భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశముంది. అందుకే ఈ- స్టాంప్ విధానం అందుబాటులోకి తీసుకొచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details