ఈ ఏడాది ఖరీఫ్ నుంచి 81 శాతం ఫీడర్లలో వ్యవసాయానికి పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత ఖరీఫ్‌లో 58 శాతం ఫీడర్లలో 9 గంటలు పగటి పూట ఇచ్చామని... ఈసారి దీన్ని 81 శాతానికి పెంచుతున్నట్లు ఇంధన శాఖ అధికారులు సీఎం జగన్‌కు తెలిపారు. విద్యుత్ రంగంపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్, జెన్‌కో ఛైర్మన్ సాయిప్రసాద్, జెన్‌కో ఎండీ శ్రీధర్, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయ కల్లం పాల్గొన్నారు. లాక్డౌన్ వల్ల విద్యుత్ పంపిణీలో ఇబ్బంది కలిగిందని.. మిగిలిన 19 శాతం ఫీడర్లలో పనులు మందగించాయని అధికారులు వివరించారు. వచ్చే రబీ నాటికి పనులన్నింటినీ పూర్తి చేసి 100 శాతం ఫీడర్లలో పగటిపూట 9 గంటల పాటు ఉచిత కరెంటు ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుపై సీఎం సమీక్షించారు. ప్రాజెక్టు కోసం ఇప్పటివరకూ తీసుకున్న చర్యలను అధికారులు ఆయనకు వివరించారు. మే నెలాఖరు నాటికి పనులు ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
అన్నదాతల కోసం సీఎం జగన్ కీలక నిర్ణయం - ఏపీ రైతులకు ప్రభుత్వం శుభవార్త
రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఇకపై అధిక శాతం ఫీడర్లలో 9 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. అలాగే వచ్చే రబీ నుంచి 100 శాతం ఫీడర్లలో ఉచిత కరెంటు ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు.
![అన్నదాతల కోసం సీఎం జగన్ కీలక నిర్ణయం ap government good to farmers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7020599-108-7020599-1588341880860.jpg)
ap government good to farmers