ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ నీటి సరఫరా విభాగానికి చెందిన ఓవర్ హెడ్ ట్యాంకులకు ఓ పార్టీ రంగులు వేయాల్సిందిగా పరోక్షంగా జారీ అయిన ఉత్తర్వులు వివాదం అవుతున్నాయి. నీటి ట్యాంకులకు నీలం, ఆకుపచ్చ, తెలుపు రంగులు వేయాల్సిందిగా ఆ విభాగం చీఫ్ ఇంజనీర్ ఆర్.వి.కృష్ణారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది జులై 11న జారీ అయిన ఆదేశాలు ఆలస్యంగా వెలుగు చూశాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నీటి ట్యాంకులకు రంగులు వేయాల్సిందిగా కలర్ కోడ్ నిర్దేశించారు. రెయిలింగ్స్‌కి ఎలాంటి రంగూ వేయాల్సిన అవసరం లేదంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 వేల పైచిలుకు గ్రామాల్లోని నీటి ట్యాంకులకు రంగులు వేయాల్సిందిగా సూచనలిచ్చారు.
వాటర్ ట్యాంకులకు ఈ రంగులే వేయండి: ప్రభుత్వం - latest news on ysrcp colours to water tank
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ నీటి సరఫరా విభాగానికి చెందిన ఓవర్ హెడ్ ట్యాంకులకు రాష్ట్రంలో ఓ పార్టీకి చెందిన రంగులు వేయాల్సిందిగా పరోక్షంగా జారీ అయిన ఉత్తర్వులు వివాదంగా మారాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నీటి ట్యాంకులకు నీలం, ఆకుపచ్చ, తెలుపు రంగులు వేయాల్సిందిగా అధికారులు కలర్ కోడ్ జారీ చేశారు.
వాటర్ ట్యాంక్‌కు వైకాపా రంగులు