వైఎస్‌ఆర్ నవశకం సర్వేతో పాటు వీఆర్‌ఓలు.. పౌరసరఫరాలశాఖ ఉద్యోగులు నిర్వహించిన విచారణలో భాగంగా రేషన్ కార్డులను రద్దు చేశారు. గుంటూరు జిల్లాలో 1,00,423 కార్డుల్ని అనర్హత జాబితాలో చేర్చి ఈ నెలలో సరకులు నిలుపుదల చేశారు. అనర్హత పున: పరిశీలనకు మరో అవకాశాన్ని ప్రభుత్వం ఇచ్చింది. ఆయా అంశాల్లో అనర్హత సవాలు చేస్తూ సంబంధింత ధ్రువీకరణ పత్రాల్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో అందజేయడం ద్వారా కార్డుల్ని పునరుద్ధరించుకోవచ్ఛు.
- ఆదాయ పన్ను చెల్లించకపోయినా చెల్లించినట్లు చూపించి కార్డు రద్దు చేస్తే ఛార్డెడ్ అకౌంటెంట్(సీఏ) ప్రాక్టీషనర్ నుంచి ఫారం-16 తీసుకుని సమర్పిస్తే కార్డు పునరుద్ధరిస్తారు.
- 300 యూనిట్లకంటే తక్కువ విద్యుత్తు వినియోగం ఉన్నా ఎక్కువ ఉన్నట్లు చూపించి కార్డు రద్దు చేస్తే విద్యుత్తుశాఖ ఏఈ నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకుని సమర్పిస్తే కార్డు రద్దవ్వదు.
- నాలుగు చక్రాల వాహనం లేకపోయినా ఉన్నట్లు గతంలో ఉన్న వివరాల ఆధారంగా కార్డు తొలగిస్తే ఆర్టీవో, బ్రేక్ ఇన్‌స్పెక్టర్ల నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకుని సమర్పించాలి.
- కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఎవరూ లేకపోయినా కార్డు తొలగిస్తే ఏ శాఖ ఉద్యోగిగా చూపించారో ఆ శాఖ పర్యవేక్షకాధికారి నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకుని సమర్పించాలి.
- పదెకరాలకంటే తక్కువ భూమి ఉండి కూడా ఎక్కువగా ఉన్నట్లు చూపించి రద్దు చేస్తే తహసీల్దార్ నుంచి 1బీ ధ్రువపత్రం తీసుకోవాలని డీఎస్‌ఓ పద్మశ్రీ పేర్కొన్నారు.
గుంటూరు మున్సిపాల్టీ అయ్యింది ఎప్పుడంటే..?