ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఒకటో తారీఖు తరువాత.. ఎన్ని రోజులు కావాలి సీఎం గారు..!

APNGOS: ఉద్దేశపూర్వకంగానే ఒకటో తేదీన వేతనాలు ఇవ్వటం లేదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘ నేతలు ఆరోపించారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు కనీస గౌరవం దక్కటం లేదంటూ.. విరుచుకుపడ్డారు. ఉద్దేశపూర్వకంగానే ఒకటో తేదీన వేతనాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పీఆర్సీ విషయంలో గత సంప్రదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Dec 18, 2022, 10:51 PM IST

AP government employees leaders: ఏపీ ఆర్థిక పరిస్థితి భేషుగ్గా ఉందన్న సీఎం జగన్‌.. ఉద్యోగులకు సమయానికి జీతాలు ఎందుకు ఇవ్వడం లేదని ఏపీ ప్రభుత్వ ఉద్యొగ సంఘ నేతలు ఆరోపించారు. దీనిపై మంత్రి బుగ్గన సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

సూర్యనారాయణ: వైకాపా సర్కారు ఉద్దేశపూర్వకంగానే ఒకటో తేదీన వేతనాలు ఇవ్వడం లేదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ ఆరోపించారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం-గుంటూరు కౌన్సిల్‌ ద్వితీయ మహాసభలకు ఆయన హాజరయ్యారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు కనీస గౌరవం దక్కడం లేదంటూ విరుచుకుపడ్డారు. ఆర్థిక పరిస్థితి భేషూగ్గా ఉందని చెప్పిన సీఎం జగన్‌.. వేళకు వేతనాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఉద్యోగుల సమస్యలకు ఆర్థిక మంత్రి బుగ్గన బదులివ్వాలని అన్నారు. పీఆర్సీ విషయంలో గత సంప్రదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. ఉద్యోగులకు వేతనాలు, పాత బకాయిలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.

ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ

బండి శ్రీనివాస్: జనవరి నెలలోపు ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుంటే.. ఉద్యోగులంతా ఏకమై సమ్మెకు వెళతామని ఏపీఎన్​జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాస్ ప్రకటించారు. కృష్ణా జిల్లా గుడివాడలో నూతనంగా ఏర్పాటు చేసిన అసోసియేషన్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి, ఒప్పంద ఉద్యోగుల పట్ల వివక్ష చూపిస్తోందని వ్యాఖ్యానించారు. ఒకటో తారీఖు జీతం వస్తుందన్న భరోసా ప్రభుత్వ ఉద్యోగుల్లో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల జీపీఎఫ్ డబ్బులు ప్రభుత్వం వాడుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

ఏపీఎన్​జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాస్

పెన్షనర్లు:పెన్షనర్లు చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో జీవిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉపాధ్యాయ సంఘ అధ్యక్షుడు కె.ఆల్ఫ్రెడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారితే జీవితాలు మారుతాయని ఎంతో నమ్మకంతో ఎన్నికల్లో గెలిపించుకున్నామని అన్నారు. వైకాపా ప్రభుత్వం పెన్షనర్లకు వ్యతిరేకమైన విధానాలను అవలంబిస్తూ తమను కుంగదీస్తోందని తెలిపారు.

విశ్రాంత ఉద్యోగులు

పీఆర్సీ రద్దు కోరుతూ.. 5కె వాక్‌: సీపీఎస్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ.. యూటీఎస్‌ ఆధ్వర్యంలో నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు 5కె వాక్‌ నిర్వహించారు. నెల్లూరు ఎన్‌జీవో హోం నుంచి గాంధీ బొమ్మ సెంటర్ వరకు నడిచారు. సీపీఎస్‌ రద్దు చేస్తామన్న సీఎం జగన్‌.. ఇచ్చిన హామీని తుంగలో తొక్కారని పట్టభద్రుల ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు మండిపడ్డారు. సీపీఎస్‌ వద్దంటూ పోరాటాలు చేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులపై బైండోవర్‌ కేసులు నమోదు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఎస్‌ విధానం రద్దు చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details