ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Ex Gratia: తాడేపల్లి అత్యాచార బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం - తాడేపల్లి అత్యాచార ఘటన తాజా వార్తలు

తాడేపల్లి అత్యాచార ఘటనపై హోంమంత్రి సుచరిత(home minister sucharitha) ఆవేదన వ్యక్తం చేశారు. గంటూరు జీజీహెచ్​లో మంత్రి తానేటి వనితతో కలిసి బాధితురాలిని పరామర్శించిన ఆమె..ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా ఇలాంటి ఘటనలు జరగటం దురదృష్టకరమన్నారు. బాధిత యువతికి ప్రభుత్వం రూ. 5 లక్షల పరిహారాన్ని (Ex Gratia) ప్రకటించిందని మంత్రి వెల్లడించారు.

ap government announced Ex Gratia for tadepally gang rape victim
తాడేపల్లి అత్యాచార బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం

By

Published : Jun 21, 2021, 3:36 PM IST

తాడేపల్లి అత్యాచార బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం

తాడేపల్లి అత్యాచార(gang rape) బాధిత యువతికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 లక్షల పరిహారాన్ని(Ex Gratia) ప్రకటించింది. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ తరపున మరో 50 వేలు అందించనున్నట్లు మంత్రులు తానేటి వనిత(taneti vanitha), సుచరిత(sucharitha) వెల్లడించారు. గుంటూరు జీజీహెచ్​లో చికిత్స పొందుతున్న బాధితురాలిని మంత్రులు పరామర్శించారు. వైద్యులను అడిగి ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.

అత్యాచార ఘటనపై ఆవేదన వ్యక్తం చేసిన హోంమంత్రి(home minister)..ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా ఇలాంటి ఘటనలు జరగటం దురదృష్టకరమన్నారు. ఘటన నిందితులను పట్టుకోవటానికి నాలుగు పోలీసు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా కఠిన చర్యలు చేపడతామని వెల్లడించారు. దర్యాప్తు వేగవంతం చేసి దోషులకు శిక్షపడేలా చూస్తామని హోం మంత్రి చెప్పారు. ఇప్పటికే నాలుగు ఫోరెన్సెక్ ల్యాబ్​లను ఏర్పాటు చేశామన్నారు.

ABOUT THE AUTHOR

...view details