ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిలకలూరిపేట చిన్నారి ప్రతిభ.. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్​లో చోటు! - ఏపీ తాజా వార్తలు

చిల‌క‌లూరిపేటకు చెందిన తొమ్మిదేళ్ళ చిన్నారి బాలిక ఫజీలా.. గిన్నిస్‌ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్‌లో స్ధానం సొంతం చేసుకుంది. ర‌సాయ‌న శాస్త్రంలో ఆవ‌ర్త‌న ప‌ట్టిక‌లోని మూల‌కాల‌ను తక్కువ సమయంలో పేర్చ‌టంలో ఫజీలా ఈ అవార్డు సాధించింది.

record
record

By

Published : May 8, 2021, 9:54 AM IST

record

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని సుభాని నగర్​కు చెందిన తొమ్మిదేళ్ల చిన్నారి ఫజీలా... ప్రతిష్టాత్మకమైన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్​లో చోటు సంపాదించుకుంది. రసాయన శాస్త్రంలోని ఆవర్తన పట్టికలో ఉన్న మూలకాలను అతి తక్కువ సమయంలో పేర్చటంలో ఫజీలా ఈ రికార్డు సాధించింది.

కేవలం ఒక నిముషం 43 సెకన్లలో ఆమె పేర్చి.. 2 నిముషాల 29 సెకన్లతో ఉన్న పాకిస్థాన్ బాలిక రికార్డును ఫ‌జీలా అధిగమించింది. ఫజీలా తండ్రి రహీం పెదనందీపాడులోని ప్రభుత్వ ఉర్దూ ప్రాధమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. తల్లి గృహిణిగా ఉన్నారు. తండ్రి ఉపాధ్యాయుడు కావ‌టంతో తండ్రి తెలిపిన విష‌యాల‌ను ఆస‌క్తిగా గ‌మ‌నిస్తూ ఉండేది. ర‌సాయ‌న శాస్త్రంపై ఆస‌క్తి ఉండ‌టంతో గిన్నిస్ రికార్డును సాధించింది.

ABOUT THE AUTHOR

...view details