ప్రజోపయోగ పనులు చేశాం... గెలుస్తాం: దూళిపాళ్ల - ponnuru mla
ప్రతిక్షణం జనహితం కోసం పని చేశామని గుంటూరు జిల్లా పొన్నూరులో ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర కుమార్ స్పష్టం చేశారు. గత ఐదేళ్లుగా నియోజకవర్గంలో కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు.
ప్రజోపయోగ పనులను చేశాం@పొన్నూరు ఎమ్మెల్యే
పొన్నూరులో రెండున్నర కోట్లతో నూతన వైద్యశాల నిర్మాణం, మండల కేంద్రమైన చేబ్రోలులో నూతన వైద్యశాల నిర్మాణం మెుదలగు అనేక ప్రజోపయోగ పనులుచేశామని ప్రకటించారు. గత 10 సంవత్సరాల కాలంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తమ దృష్టికి వచ్చిన సమస్యలను అధికారం వచ్చిన తర్వాతపూర్తి చేశామన్నారు.