ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఐసోలేషన్​లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండండి.. కరోనా నుంచి కోలుకోండి' - ఏపీ తాజా వార్తలు

హోం ఐసోలేషన్​లో ఉండే వారు ఇంటి నుండి బయటకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని.. కరోనా నుండి బయటపడాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా తెలిపారు. గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్​ని నగర మేయర్ కావటి మనోహర నాయుడు, నగర కమిషనర్ చల్లా అనురాధతో కలిసి ఆయన పరిశీలించారు.

covid call center
covid call center

By

Published : May 8, 2021, 5:15 PM IST

గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కోవిడ్ కాల్ సెంటర్​ను గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా పరిశీలించారు.హోం ఐసోలేషన్ లో ఉన్న కొవిడ్ బాధితులతో ఆయన ఫోన్ లో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. హోం ఐసోలేషన్ లో ఉండేవారికి కిట్​లు అందాయో లేదో వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాజిటివ్ వచ్చిన వారు మనో ధైర్యంతో ఉండాలన్నారు. సాధారణ లక్షణాలు ఉన్నవారు ఇంట్లోనే వేరుగా గది ఉంటే ఉపయోగించుకోవాలని కోరారు. స్థానిక అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యుల పర్యవేక్షణలో ఇంటిలోనే ఉండి కరోనా నుంచి బయటపడవచ్చని తెలిపారు. వైద్యులు సూచించిన మందులతో పాటు రెండు పూటలా ఆవిరి పట్టాలని, బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలన్నారు. ఇంటిలో ఉండేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాకూడదని ఎమ్మెల్యే సూచించారు.

కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతున్నందున ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని నగర మేయర్ కావటి శివ నాగ మనోహర నాయుడు అన్నారు . మాస్క్ ధరించడం, తగిన భౌతిక దూరం పాటించడం, శానిటైజర్ వినియోగించడం చేయాలన్నారు. ముఖ్యమైన అవసరం వస్తే మినహా అనవసరంగా బయట తిరగొవద్దని కోరారు.

నగరంలోని అన్ని పట్టణ ఆరోగ్య కేంద్రాలు, కుందుల రోడ్ లోని లైబ్రరి, గాంధీ పార్క్ లతో పాటుగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అనుమతి పొందిన కొత్తపేటలోని కొనాక్ ల్యాబ్, అరండల్ పేటలోని మైల్ స్టోన్ ల్యాబ్, ముత్యలరెడ్డి నగర్ లోని మైక్రో ల్యాబ్, కుందుల రోడ్ లోని యోన్టస్ ప్రైవేట్ ల్యాబ్ ల్లో కొవిడ్ పరీక్షలు జరుగుతున్నాయని కమిషనర్ చల్లా అనురాధ తెలిపారు. ప్రభుత్వ పరీక్షా కేంద్రాలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన కేంద్రాల్లోనే కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. అలా కాకుండా అనధికార పరీక్షా కేంద్రాల్లో కరోన పరీక్షలు చేయించుకోవడం వల్ల సమస్యలు ఎదురవుతాయన్నారు.

ప్రతి రోజు నగరంలో నమోదు అవుతున్న పాజిటివ్ కేసులు ప్రైమరీ కాంటాక్ట్స్ గుర్తింపు వేగంగా చేస్తున్నామని కమిషనర్ చల్లా అనురాధ తెలిపారు. కొందరు కరోనా పరీక్ష సమయంలో తప్పుగా ఫోన్ నంబర్, చిరునామా ఇస్తున్నారన్నారు. దీని వలన కాంటాక్ట్స్ ట్రేసింగ్ ఇబ్బంది అవ్వడంతో పాటు పేషంట్ ఆరోగ్య స్థితి పరిశీలనకు సమస్యలు వస్తున్నాయన్నారు. కనుక ప్రతి ఒక్కరు సరైన సమాచారం ఇవ్వాలని కోరారు. హోం ఐసోలేషన్ లో ఉండేవారు ఇంటి నుండి బయటకు వస్తే స్థానిక వాలంటీర్ ద్వారా వారిని వెంటనే కొవిడ్ కేర్ సెంటర్ కి తరలిస్తామన్నారు.

ఇదీ చదవండి:

కడప జిల్లా మామిళ్లపల్లె శివారులో పేలుడు.. 9 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details