ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరులో ఆకర్షణీయంగా  పోలింగ్ కేంద్రాలు - గుంటూరు జిల్లా నల్లచెరువు,నరసారావు పేట కేసనపల్లిలో

నేడు గుంటూరు జిల్లా నల్లచెరువు,నరసారావు పేట కేసనపల్లిలో రీపోలీంగ్ జరగనుంది. అధికారులు అన్ని ఏర్పాట్లును సిద్దం చేశారు.

గుంటూరులో ఆకర్షణీయమైన రంగులతో ముస్తాబైన పోలింగ్ కేంద్రాలు

By

Published : May 6, 2019, 5:42 AM IST

Updated : May 6, 2019, 8:04 AM IST

2019 ఏప్రిల్ 11 న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు జిల్లాలో రెండు పోలింగ్ కేంద్రాలలో అలజడి జరిగిన నేపథ్యంలో గుంటూరు నల్లచేరువు, నరసరావుపేట కేసనపల్లి లో రిపోలింగ్ నిర్వహిచటకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు కు అనుగుణంగా నేడు జిల్లాలో రెండు చోట్ల పోలింగ్ నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. పోలింగ్ కేంద్రాలను సర్వాంగసుందరంగా ఆకర్షణీయమైన రంగులతో, మామిడి తోరణాలతో తీర్చిదిద్దారు. వేసవి దృష్ట్యా మజ్జిగ , చల్లని త్రాగునీరు, కూలర్లు ను ఏర్పాటు చేశారు. ప్రశాంతమైన వాతావరణం లో అర్హులైన ఓటర్ల వచ్చి తమ ఒక్క ఓటు హక్కను విధిగా వినియోగించుకోవాలని గుంటూరు తూర్పు డిఎస్పీ నసిరద్దీన్ వెల్లడించారు. గతంలో జరిగిన అలజడులు నేపద్యంలో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు అందరు బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని డీఎస్పీ పేర్కొన్నారు.

గుంటూరులో ఆకర్షణీయమైన రంగులతో ముస్తాబైన పోలింగ్ కేంద్రాలు
Last Updated : May 6, 2019, 8:04 AM IST

ABOUT THE AUTHOR

...view details