ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అదనపు కట్నం కోసం వేధిస్తున్న భర్తపై భార్య ఫిర్యాదు - కట్నం

కట్నం తేవాలని భర్త తనను వేధిస్తున్నాడని బాధితురాలు గుంటూరు అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేసింది.

కట్నం తేవాలన్న భర్తపై ఫిర్యాదు చేసిన భార్య

By

Published : Apr 30, 2019, 5:03 AM IST

Updated : Apr 30, 2019, 8:44 AM IST

కట్నం తేవాలన్న భర్తపై ఫిర్యాదు చేసిన భార్య

భర్త అదనపు కట్నం కోసం భార్యను వేధిస్తున్న ఘటన గుంటూరులో చోటు చేసుకుంది. వరంగల్ లో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్​గా విధులు నిర్వహిస్తున్న కట్టా రామకృష్ణకి గుంటూరు గోరంట్లకు చెందిన జ్యోతికి 2 సంవత్సరాల క్రితం పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది. పెళ్లి సమయంలో ఛత్తీస్​గఢ్​లో పనిచేసే రామకృష్ణ ... వరంగల్​కు బదిలీ అయ్యాడు. పెళ్లయిన మొదటి సంవత్సరం తర్వాత ఆస్తిలో భాగాన్ని, మరికొంత కట్నం ఇవ్వాలని తరచూ వేధిస్తున్నారని బాధితురాలు పేర్కొన్నారు. తాను వరంగల్ లో పని చేస్తున్నా కానీ ఇప్పటివరకు తనను గుంటూరులోనే వదిలేసి వెళ్లిపోయాడని తెలిపింది. తనను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని బాధితురాలు వాపోయింది. ఇదేంటి అని పెద్దల సమక్షంలో ప్రశ్నించగా మీ అమ్మాయి అందంగా లేదు.. ఆస్తి సరిపోలేదు... కట్నం కొంచెం ఇచ్చారని భర్త తరపు బంధువులు అంటున్నారన్నారు. తన భర్త రామకృష్ణ ఏకంగా తనపై దాడికి పాల్పడుతున్నాడని బాధితురాలు కన్నీరుమున్నీరైంది . న్యాయం చేయాలని గుంటూరు అర్బన్ ఎస్పీకి ఆమె ఫిర్యాదు చేసింది.

Last Updated : Apr 30, 2019, 8:44 AM IST

ABOUT THE AUTHOR

...view details