ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జీజీహెచ్​లో కరోనా బాధితుల కోసం ప్రత్యేక చర్యలు

జీజీహెచ్​లో కరోనా రోగుల సమస్యలపై అధికారులు చర్యలు చేపట్టారు. కొవిడ్ ఓపీ వద్ద ప్రత్యేకంగా వైద్యులను, సిబ్బందిని అదనంగా నియమించారు. లక్షణాలు, వాటి తీవ్రతను బట్టి చికిత్స కేంద్రాలకు తరలిస్తున్నారు. ఒకవేళ లోపల పడకలు లేకుంటే బస్సులోనే వారు సేదతీరేలా జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా బస్సు కేటాయించింది.

Better_Actions
Better_Actions

By

Published : May 14, 2021, 12:36 PM IST

గుంటూరు జీజీహెచ్​లో కరోనా రోగుల సమస్యలపై జిల్లాయంత్రాంగం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. గుంటూరు ప్రభుత్వ సర్వజనాస్పత్రికి వచ్చే రోగులను సరిగ్గా ఆదరించడం లేదని.. పడకలు లభ్యం కాక సకాలంలో వైద్యచికిత్సలు అందడం లేదనే విమర్శల వస్తున్న క్రమంలో కొవిడ్ ఓపీ వద్ద ప్రత్యేకంగా వైద్యులను, సిబ్బందిని అదనంగా నియమించారు. వచ్చే రోగులను వారి లక్షణాలను గుర్తించి కరోనా కేర్ సెంటర్​కు పంపాలా? లేదా ఆస్పత్రిలో చేర్చాలా? లేదా హోం ఐసోలేషన్ సరిపోతుందా అనే విషయంపై స్పష్టత తెస్తున్నారు.

తక్కువ లక్షణాలు ఉన్నవారిని, ఆక్సిజన్ అంతగా అవసరం లేని రోగులను పక్కనే రైల్ మహల్లోని కొవిడ్ కేర్ సెంటర్లకు పంపిస్తున్నారు. అలాగే డిశ్ఛార్జవుతున్న కొందరు రోగులకు ఇంకా స్పల్ప లక్షణాలుంటే రైల్ మహల్లోని స్టెప్ డౌన్ సెంటర్​కు బస్సుల ద్వారా పంపిస్తున్నారు. ఒకవేళ లోపల పడకలు లేకుంటే బస్సులోనే వారు సేదతీరేలా జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా బస్సు కేటాయించింది. దీనివల్ల బయట ఎవరూ పడుకోకుండా బస్సులోనే సేదతీరేలా ఏర్పాట్లు చేసినట్లు జీజీహెచ్ అధికారులు చెప్పారు.

ఇదీ చదవండి:దేశంలో మరో 3.43 లక్షల కేసులు, 4వేల మరణాలు

ABOUT THE AUTHOR

...view details